వేటగాడు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 86: పంక్తి 86:
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]

10:59, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

వేటగాడు
(1979 తెలుగు సినిమా)
దస్త్రం:Vetagadu.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం ఎం.అర్జునరాజు,
కె.శివరామరాజు
కథ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
రావుగోపాలరావు
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నృత్యాలు సలీమ్‌
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
సంభాషణలు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
ఛాయాగ్రహణం కె.యస్.ప్రకాష్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వేటగాడు 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా. ఇది రోజా మూవీస్ పతాకంపై అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమైనది. ఎన్.టి.ఆర్.కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం.

చిత్రకథ

జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు. కృష్ణుడు స్యమంతకమణి సత్రాజిత్తును అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య (పుష్పలత) ను దివాను (రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లోపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి (చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమెను హారం కోసం హత్య చేసుంటాడని జగ్గయ్యతో దీవాను చెబుతాడు. అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు. ప్రస్తుత కథలో రామారావు, కాంతారావు కొడుకు, వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురు. వేటకు అడవికి బయలుదేరిన రామారావుకు తన ఎస్టేటుకు బయలు దేరిన శ్రీదేవి కలుస్తుంది. రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవిని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ. దివాను చేసే అక్రమ వ్యాపారాలు, పుష్పలత ఏమైంది, హారం ఎవరి పాలైంది, జగ్గయ్యకు అపోహలు ఎలా తొలిగాయన్నది చిత్ర కథ. నగేష్, అల్లు రామలింగయ్య, మమతలు హాస్యాన్ని పంచారు. జంధ్యాల సంభాషణలు చిత్రానికి బలాన్నొచ్చాయి. ప్రత్యేకంగా రావు గోపాలరావు ప్రాసతో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. (ధనం నాయనా ధనం మనిషిని నడపించే ఇంధనం, ఏ రోజూ రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళవంటి తాజా వార్త లాంటివి)

నటీనటులు

పాటలు

ఈ సినిమాలో 7 పాటలను చిత్రీకరించారు.[1]

పాట గీతరచన గానం సంగీతం నటీనటులు
ఆకుచాటు పిందెతడిసే...కోకమాటు పిల్లతడిసె
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., శ్రీదేవి
ఇది పూవులు పూయని తోట ఏ ప్రేమకు నోచని వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.జానకి కె.చక్రవర్తి
ఓసోసి పిల్ల కోడి పెట్టా వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., శ్రీదేవి
కొండమీన చందమామ కోన లోన కోయభామ వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., శ్రీదేవి
జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., శ్రీదేవి
పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., జయమాలిని
బంగారు బాతు గుడ్డూ, బందారు తొక్కుడు లడ్డూ వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.చక్రవర్తి ఎన్.టి.ఆర్., శ్రీదేవి

సంభాషణలు

ఈ సినిమా కోసం జంధ్యాల మంచి ప్రాసతో కొన్ని సంభాషణలను రచించారు. వీటిని రావుగోపాలరావు ద్వారా పలికించారు.

  • ఏరోజూ రాని రోజా ఈరోజు వస్తోందన్న కూజా నీళ్లలాంటి మజాయైన వార్త వస్తే కాజా తిన్నట్లు సంతోషించి మేజా బల్లయెక్కి కూర్చోక వీపున బాజా మోగినట్లు బాధపడతావేరా మేధావి.
  • నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరున్ని చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరున్ని చేయగల ఇంతి, నీకు సహధర్మచారిణిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని, చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి, హైరానా పడి వచ్చేస్తే లోకజ్ఞానరహితా ! అది ప్రణయ కలహంరా పిచ్చినాన్నా.

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు