చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26: పంక్తి 26:
== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==
{{చిన్నచింతకుంట మండలంలోని గ్రామాలు}}
{{చిన్నచింతకుంట మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:జనగణన పట్టణాలు]]

13:15, 25 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలానికి చెందిన జనగణన పట్టణం.ఈ మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళుతుంది. మండలం నారాయణపేట డివిజన్‌లో పరిధిలోని భాగము.మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.

గణాంకాలు

కురుమూర్తి స్వామి దేవాలయ ప్రవేశద్వారం

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.

2001 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం 44548 జనాభా ఉంది.10180 కుటుంబాలు.[1] అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.[2]పిన్ కోడ్: 509131.

ఇతర విశేషాలు

తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది.

సంఘటనలు

  • 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందాడు.[3]
కురుమూర్తిస్వామి మెట్లదారి

రాజకీయాలు

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[4]

మండలంలోని ప్రముఖ ఆలయాలు

కురుమూర్తిస్వామి దేవాలయం

ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన కురుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.

మూలాలు

  1. Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  3. ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు