సామల రమేశ్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:సంపాదకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 15: పంక్తి 15:
[[వర్గం:పత్రికారంగం]]
[[వర్గం:పత్రికారంగం]]
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
[[వర్గం:సంపాదకులు]]

10:49, 11 అక్టోబరు 2020 నాటి కూర్పు

సామల రమేశ్ బాబు

సామల రమేశ్ బాబు వృత్తి రీత్యా వైద్యుడు. అతను నేటితరం మాతృభాషకు దూరమవుతున్న పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ కోసం, పదేళ్ల క్రితమే వైద్యవృత్తిని వదిలేసి, 67 ఏళ్ల వయసులో కూడా నిరంతరం భాషోద్యమంలో పాలుపంచుకుంటున్న వ్యక్తి.[1]

జీవిత విశేషాలు

తెలుగు వికీపీడియా మహోత్సవము 2013 లో ప్రసంగిస్తున్న రమేశ్ బాబు

అతను గుంటూరు లయోలా కళాశాలలో విద్యనభ్యసించాడు. అతను ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ సమయంలో భాషా అంశాలే ప్రధానంగా వస్తున్న 'నడుస్తున్న చరిత్ర' మాసపత్రికకు సంపాదకుడు.[1] అతను తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్నాడు.

నడుస్తున్న చరిత్ర (అమ్మనుడి)

1983 నుండి 2013 వరకు "నడుస్తున్న చరిత్ర" పత్రికను విజయవాడ కేంద్రంగా ప్రచురించాడు[2]. అందులో 2001 నుండి రాజకీయ విశ్లేషణలతోపాటుగా భాషా ఉద్యమాల గురించి వ్యాసాలు రావడం ప్రారంభమై, 2009 నాటికి పూర్తిస్థాయి భాషోద్యమ పత్రికగా రూపాంతరం చెందింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాణంలోను, ఎదుగుదలలోను వెన్నుదన్నుగా నిలిచి ఒక భాషోద్యమ పత్రికగా పేరు గడించింది. ప్రభుత్వాన్నయినా, పెద్దలనయినా తెలుగు జనశ్రేయస్సు కోసం నిలదీసిన చరిత్ర, తెలుగుకు ప్రాచీనభాష హోదా కోసం జరిగిన పోరాటానికి దారిచూపి అండగా నిలిచిన చరిత్ర ‘నడుస్తున్న చరిత్ర’దే. అటువంటి పత్రికకు ఆర్థిక వనరులు అడుగంటడంతో 2013 అక్టోబరు సంచికతో ప్రచురణను ఆపివేయ వలసివచ్చింది. రమేశ్ బాబు అనారోగ్యంతో ఒక ఏడాదికి పైగా విశ్రాంతిగా గడుపవలసి వచ్చింది. తర్వాత ఆరోగ్యాన్ని పుంజుకొని, మళ్ళీ అతను భాషోద్యమ యాత్రను కొనసాగిస్తున్నాడు. తిరిగి 2015 ఉగాదికి (మార్చి) తొలి సంచికతో పేరు మార్చుకొని "అమ్మనుడి" గా వెలువడింది. ‘అమ్మనుడి’ పత్రికకు నడుస్తున్న చరిత్ర చదువరులే తొలి చదువరులు, ప్రోత్సాహకులు. దీని నిర్వహణ కోసం ‘తెలుగుజాతి’ ట్రస్టును మిత్రులతో కలిసి స్థాపించాడు. ఆ ట్రస్టు తరఫున ఈ పత్రిక వెలువడుతున్నది.[3]

మూలాలు

  1. "Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc". web.archive.org. 2013-05-08. Retrieved 2020-06-28.
  2. "కథానిలయం - View Magazine". kathanilayam.com. Retrieved 2020-06-29.
  3. "'నడుస్తున్న చరిత్ర' – "అమ్మనుడి"". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-21. Retrieved 2020-06-29.