చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: తిరగ్గొట్టారు
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 119: పంక్తి 119:
*పూర్తి వ్యాసం [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
*పూర్తి వ్యాసం [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.


===పట్టణ విశేషాలు===
==పట్టణ విశేషాలు==
<!--
<!--
చిలకలూరిపేట has produced so many great personalities like "peda and china peerusahebs" in nadaswara art. Acharya ranga conducted congress training classes in చిలకలూరిపేట in 1935-Kasu Brahamanandha reddy was arrested in 1942 quit India movement in చిలకలూరిపేట. It has become a great center for commercial crops like cotton and Tobacco Sri Sompalli Sambaiah who has acted as an M.L.A to this area for long time, karnam Rangarao, Kandimalla Buchaiah, Kandhimalla Jayamma, Thota Barathudu, Murukipudi Satayanarayancharulu, Jacob Gandhi, Rachumallu Kannaiah and Mylavarupu Govindiah have worked a lot for the development of this town.
చిలకలూరిపేట has produced so many great personalities like "peda and china peerusahebs" in nadaswara art. Acharya ranga conducted congress training classes in చిలకలూరిపేట in 1935-Kasu Brahamanandha reddy was arrested in 1942 quit India movement in చిలకలూరిపేట. It has become a great center for commercial crops like cotton and Tobacco Sri Sompalli Sambaiah who has acted as an M.L.A to this area for long time, karnam Rangarao, Kandimalla Buchaiah, Kandhimalla Jayamma, Thota Barathudu, Murukipudi Satayanarayancharulu, Jacob Gandhi, Rachumallu Kannaiah and Mylavarupu Govindiah have worked a lot for the development of this town.

05:38, 22 అక్టోబరు 2020 నాటి కూర్పు

చిలకలూరిపేట
—  నగరం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యం [1]
 - మొత్తం 18.13 km² (7 sq mi)
జనాభా (2011)[1]
 - మొత్తం 1,01,398
పిన్ కోడ్ 522616
ఎస్.టి.డి కోడ్

చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం.[2] గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది.గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన ఈ పట్టణం జనాభా 147,179 (2001). ఈ ప్రాంతం ప్రజలు దీనిని పేట అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని పెద్ద శాసనసభా నియోజక వర్గాలలో చిలకలూరిపేట ఒకటి. ఈ ప్రాంతంలోని 85 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడ్డవారు[ఆధారం చూపాలి]. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కి మీలే.

చరిత్ర

చిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. పన్ను రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. పిండారీలు చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు గోపురం గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.

దేవాలయాలు

శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం

ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది.

శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి పంచాహ్నిక మహోత్సవాలు, 2014,మే-10 నుండి 17 వరకు నిర్వహించెదరు. [1]

ఆలయ చరిత్ర

క్రీ.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. 18-10-1918 నాడు ఇక్కడ పెద్ద రథశాల నిర్మించారు. స్వామివారు వామాంకమున లక్స్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.

శ్రీ షిర్డీ సాయి మందిరం

చిలకలూరిపేట లోని ఎన్.టి.ఆర్.కాలనీలో గల సాయినగర్‌లోని ఈ ఆలయంలో, నూతనంగా నిర్మించిన గాయత్రీదేవి స్థూపాన్ని, 21-10-2020 బుధవారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో, ప్రారంభించినారు. గాయత్రీదేవి స్వరూపమైన 24 పేర్లతో ఉన్న 24 అమ్మవార్లను, ఈ స్థూపంపై నిక్షిప్తం చేయడం ఒక విశిష్టంగా పేర్కొన్నారు. [2]

శాసనసభ నియోజకవర్గం

పట్టణ విశేషాలు

చిలకలూరిపేట ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి అందించింది. మరెందరో ఈ పట్టణంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆచార్య రంగా, కాసు బ్రహ్మానంద రెడ్డి మొదలైనవారు పేటతో అనుబంధం ఉన్న వ్యక్తులు. 1935లో రంగా గారు ఇక్కడ కాంగ్రెసు శిక్షణా శిబిరం నిర్వహించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి ఇక్కడే అరెస్టయ్యారు.ఇది ఒకప్పుడు పొగాకు,ప్రత్తి వంటి వాణిజ్య పంటలకు ప్రశిధ్ది చెందినది.

ఈ ప్రాంతమునకు శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించిన వారు శ్రీయుతులు కరణం రంగారావు (సి.పి.ఐ.), సోమేపల్లి సాంబయ్య (కాం),కందిమళ్ళ బుచ్చయ్య (స్వ), డా.కాజా కృష్ణమూర్తి (టి.డి.పి.), కందిమళ్ళ జయమ్మ (టి.డి.పి), మర్రి రాజశేఖర్ (కాం), ప్రస్తుతము ప్రత్తిపాటి పుల్లారావు (టి.డి.పి.),

నాదస్వర విద్వాంసులు

  • షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు 1830
  • షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు 1850
  • షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు 1904
  • నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు 1915
  • కోలాటం కళాకారులు: రాయిపాటి పాపారావు కోలాటం శిక్షణాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం లాంటి దేవస్థానం లలో వందల ప్రదర్శనలిచ్చారు.ఉచిత శిక్షణ వేలమందికి భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ద్వారా అందించారు.

ప్రముఖులు

  • భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్,ప్రముఖ ఆయుర్వేద, పురాతన భారతీయ ఆలయాల నిర్మాణం పై పరిశోధనలు నిర్వహించిన సంస్థ. తిమ్మాపురం.
  • జాన్ డేవిడ్ ఫార్ కార్నర్స్ సేవా సంస్థ స్థాపకుడు
  • అల్లాబక్ష్ షేక్‌
  • సంగిసెట్టి వీరయ్య
  • భద్రం
  • తోట నరసింహారావు
  • తోటకూర వెంకటనారాయణ
  • షేక్ బాషా
  • కృష్ణారావు
  • ఇందుపల్లి రాజకుమార్
  • కందా నాగేశ్వరరావు
  • బుచ్చయ్య
  • పద్మారావు
  • కే సందీప్ Rubiks క్యూబ్ ఫాస్ట్ హార్డ్వేర్ ఇంజనీర్, రాయల్ స్ట్రేంజర్స్ సహ వ్యవస్థాపకుడు
  • కొయ్యలగుంట మల్లయ్యలింగం కమ్యూనిస్టు యోధుడు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

మంచినీటి చెరువు.

కళాశాలలు

  • చుండు రంగనాయకులు జూనియర్ కళాశాల
  • ఎస్.వి.ఆర్. జూనియర్ కళాశాల
  • వివేకానంద జూనియర్ కళాశాల
  • మోడరన్ జూనియర్ కళాశాల
  • కాకతీయ జూనియర్ కళాశాల
  • కాసు బ్రహ్మానంద రెడ్డి మహిళా జూనియర్ కళాశాల
  • డి ఆర్ యన్ ఎస్ సి వి ఎస్ కళాశాల
  • వికాస్ జూనియర్ కళాశాల
  • టి.ఆర్.కె బిఇడి కళాశాల
  • జవేరా బిఇడి కళాశాల [3]

ఉన్నత పాఠశాలలు

  • శారద ఉన్నత పాఠశాల
  • అర్.వీ.ఎస్. ఉన్నత పాఠశాలలు
  • కాకతీయ ఉన్నత పాఠశాలలు
  • (ఆధునిక)మోడరన్ ఉన్నత పాఠశాలలు
  • సైంట్ ఛార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
  • వికాస్ ఉన్నత పాఠశాల

శిల్పకళ

పురుషోత్తమపట్నం ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది[ఆధారం చూపాలి]. శిల్పకళను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.

విశేషాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల. మొత్తం 1,98,069 వోట్లున్నాయి. పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరములో అనేక వ్యాపార సంస్థలు మిల్లులు గలవు.

చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు.పాత బ్యారన్ సామానులు లభించును.

చిలకలూరిపేటలో శ్రీ ఊసా శబరీనాథ్ అను ఒక అంతర్జాతీయ చౌక్ బాల్ క్రీడాకాఎరుడు ఉన్నారు. 2014, నవంబరు-28 నుండి 30 వరకు, నేపాల్ రాజధాని కాఠ్మండు నగరంలో, భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చౌక్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఈయన భారదేశం జట్టు వైస్ కెప్టెనుగా పాల్గొని, తన ప్రతిభతో భారత జట్టు విజయానికి తోడ్పడినారు. ఈ పోటీల ఫైనల్సులో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుపై 25 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. [1]

మూలాలు

  1. 1.0 1.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.
  2. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 16 January 2015.
  3. http://prabhanews.com/2016/07/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2/[permanent dead link]

వెలుపలి లంకెలు

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,డిసెంబరు-4;11వపేజీ.