శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరి చేసాను
చి యంత్రము కలుపుతున్నది: en:Shalya
పంక్తి 9: పంక్తి 9:
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]


[[en:Shalya]]
[[id:Salya]]
[[id:Salya]]
[[jv:Salya]]
[[jv:Salya]]

00:00, 30 మే 2008 నాటి కూర్పు

Shalya in Javanese Wayang

శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు మరియు సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి చివరికి పాండురాజుకు పోగొట్టుకున్నాడు. మాద్రి కూడా పాండు రాజునే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.

శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్దమున సాయం చేయుటకు వచ్చుచుండగా దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యునికి మరియు అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి యధిష్టురుడు అనుకుని యుద్దమున సాయం చేతునని దుర్యోధనునికి మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక దుర్యోధనుని తరపున కౌరవులతో కలసి యుద్దం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు యధిష్టురుని కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రధసారధి అని తెలిసిన యధిష్టురుడు దుర్యోధనుడు అతనిని కర్ణునికి రధసారధిగా నియమించునని ఊహించెను. అలా అయినచో కర్ణుని యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.

శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి అర్జునునితో యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.

"https://te.wikipedia.org/w/index.php?title=శల్యుడు&oldid=305951" నుండి వెలికితీశారు