తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి భాషా సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
| seats4_title = రాజ్య సభ
| seats4_title = రాజ్య సభ
| seats4 = {{Composition bar|6|245|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}}
| seats4 = {{Composition bar|6|245|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}}
| symbol = కారు [[File:Car.svg|center|100px]]
| symbol = కారు [[File:Telangana Rashtra Samithi symbol.svg|center|100px]]
| flag = [[ఫైలు:TRS Flag.svg|center|70px|పార్టీ చిహ్నము]]
| flag = [[ఫైలు:TRS Flag.svg|center|70px|పార్టీ చిహ్నము]]
| website = http://www.trspartyonline.org/
| website = http://www.trspartyonline.org/

18:26, 7 జనవరి 2021 నాటి కూర్పు

తెలంగాణ రాష్ట్ర సమితి
నాయకత్వంకె.చంద్రశేఖరరావు
ప్రధాన కార్యదర్శికే.కేశవరావు
స్థాపన2001 ఏప్రిల్ 27
ప్రధాన కార్యాలయంబంజారాహిల్స్, హైదరాబాదు
పత్రికనమస్తే తెలంగాణా
సిద్ధాంతంతెలంగాణా వాదం
తెలంగాణా అసెంబ్లీ
88 / 119
లోక్ సభ
9 / 545
రాజ్య సభ
6 / 245
ఓటు గుర్తు
కారు
దస్త్రం:Telangana Rashtra Samithi symbol.svg
వెబ్ సిటు
http://www.trspartyonline.org/
జెండా
పార్టీ చిహ్నము
పార్టీ చిహ్నము

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం లో టీఆర్​ఎస్​ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్‌ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్‌ , నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్‌ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌ లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జేఎంఎం చీఫ్‌ , అప్పటి జార్ఖండ్‌ సీఎం శిబూ సోరె న్‌ ఈ మీటింగ్‌ కు చీఫ్‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. కొన్ని ఘటనల[1] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు నందినగర్ , హైదరాబాద్ లోని కేసీఆర్‌ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. 2004లో వైఎస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్​ ఉన్న స్థలాన్ని టీఆర్‌ ఎస్‌ కు కేటాయించింది. ప్రస్తుతం క్యాంటీన్‌ నిర్మిస్తున్న స్థలంలో రేకుల షెడ్డు వేసి టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభిం చారు. 2006లో తెలంగాణ భవన్‌ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీకి 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు[2].

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వరకు , తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. స్ట్రీట్ ఫైట్‌ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని , అందుకు వాహకంగా ‌తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌ )ని తీర్చిదిద్దారు. అప్పుటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో అదొక సాహసోపేతమైన సూత్రీకరణ. తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం . యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు. ఆయన దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ఒక ప్రకటన చేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది[3]. 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరు అయ్యారు . శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తరర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం మీద రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టీఆర్​ఎస్. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది.

తెలంగాణ బిల్లుకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్నికలు

2014 ఎన్నికలు

తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 శాసనసభ
26 / 294
54 17[4]
2008 శాసనసభ
(ఉపఎన్నిక)
7 16 2[5]
2009 శాసనసభ
10 / 294
45 13[6]
2010 శాసనసభ
(ఉపఎన్నిక)
11 11 0
2011 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
4 5 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2014 శాసనసభ
63 / 119
119 0[6]
2019 శాసనసభ
88 / 119
119 0[6]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 లోక్ సభ
5 / 42
22[7] 17
2008 లోక్ సభ
(ఉపఎన్నిక)
2 4 0
2009 లోక్ సభ
2 / 42
9 1 [8]
2014 లోక్ సభ
11 / 17
17 0 [8]
2019 లోక్ సభ
9 / 17
17 0 [8]

మూలాలు

  1. "TRS @ 19 : నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం | V6 Velugu" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-05-30. Retrieved 2020-04-27.
  2. "టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగరవేయాలి: కేటీఆర్". ntnews. 2020-04-26. Retrieved 2020-04-27.
  3. కాసం, ప్రవీణ్ (2018-12-11). "టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు". BBC News తెలుగు. Retrieved 2020-04-27.
  4. http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
  5. Front Page : TRS receives a setback in by-polls. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.
  6. 6.0 6.1 6.2 http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
  7. http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
  8. 8.0 8.1 8.2 http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf