శక్తి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
12 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
శక్తి అనగానే మన శరీరంలో ఉండే సత్తువ, విద్యుత్‌ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్‌ శక్తి, రైలు ఇంజను రైలు పెట్టెలను లాగటానికి కావలసిన శక్తి, మొదలైన భావాలు ఎన్నో మనస్సులో మెదులుతాయి. విశేషం ఏమంటే శక్తికి నిర్దిష్టమైన రూపు లేదు; మనకి అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. శక్తి పదార్ధం రూపంలో ఉన్నప్పుడు దానిని చేతిలోకి తీసుకొని పట్టుకోవచ్చు; కాని ఎల్లప్పుడూ ఇది సాధ్య పడదు. శక్తి [[కాంతి]] (light) రూపంలో ఉన్నప్పుడు కంటికి కనబడుతుంది; కాని ఎల్లప్పుడూ కంటికి కానరాదు. ఇందు గలదు, అందు లేదు అనే సందేహం లేకుండా ఎందెందు చూస్తే అందందే 'కనిపిస్తుంది' ఈ శక్తి; కంటికి కనిపించక పోయినా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు.
 
పదహారవ శతాబ్దం లగాయతు జరిగిన [[శాస్త్రీయ విప్లవం]] (scientific revolution) వల్ల ఈ నాడు 'శక్తి' యొక్క నిజ స్వరూపం మనకి అర్ధం అవుతోంది. [[పారిశ్రామిక విప్లవం]] (industrial revolution) తో పాటు శక్తిని అదుపులో పెట్టి వినియోగ పరచే యంత్రాలు రావటం, విద్యుత్‌ శక్తి నిజ స్వరూపం అర్ధం అవటం, [[అణువు]] (atom) ని విచ్ఛిన్నం చేసి దాని గర్భంలో శక్తిని ఆవిష్కరించటం - ఇవన్నీ గత రెండు-మూడు శతాబ్దాలలో జరిగినవే.
 
==పని (work)==
8,000

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/309950" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ