రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చి →చిత్రమాలిక |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →చిత్రమాలిక: పనిచేయని చిత్రాన్ని తొలగించాను. ఆ చిత్రం కామన్స్ లో వేరే పేరుతో వున్నా, రెండో చిత్రంలోని వ్యక్తులతోనే వున్నది. |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
== చిత్రమాలిక == |
== చిత్రమాలిక == |
||
<gallery> |
<gallery> |
||
దస్త్రం:సీనియర్ నటీమణి జామున.jpg|నిర్మాత అనురాధ దేవితో |
దస్త్రం:సీనియర్ నటీమణి జామున.jpg| జమున, నిర్మాత అనురాధ దేవితో |
||
</gallery> |
</gallery> |
||
00:11, 26 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు
రోజా రమణి | |
---|---|
రోజా రమణి | |
జననం | |
ఇతర పేర్లు | చెంబరుతి శోభన |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | చక్రపాణి |
పిల్లలు | తరుణ్ కుమార్ , అమూల్య |
రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970, 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.
జీవిత విశేషాలు
రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.[1] ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్ లో దర్శకుడు, నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.
కెరీర్
ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా, తమిళంలో పరువ కాలంగా పునర్నిర్మించారు.
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రం అందించింది.
నటించిన సినిమాలు
- అసెంబ్లీ రౌడీ (1991)
- మగధీరుడు (1986)
- పునాదిరాళ్ళు (1979)
- డ్రైవర్ రాముడు (1979)
- లంబాడోళ్ళ రామదాసు (1978)
- ఆలుమగలు (1977)
- సొమ్మొకడిది సోకొకడిది (1978)
- బలిపీఠం (1975)
- జేబు దొంగ (1975)
- ఓ సీత కథ (1974)
- రామరాజ్యం (1973)
- కన్నెవయసు (1973)
- రామాలయం (1971)
- సత్తెకాలపు సత్తెయ్య (1969)
- జరిగిన కథ (1969)
- సతీ అరుంధతి (1968)
- భక్త ప్రహ్లాద (1967)
చిత్రమాలిక
-
జమున, నిర్మాత అనురాధ దేవితో