చిలుక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి స్థానిక బొమ్మతో సమాచారపెట్టె సవరించు
పంక్తి 3: పంక్తి 3:
| color = pink
| color = pink
| name = చిలుక
| name = చిలుక
| image = Yellow naped amazon parrot left side.jpg
| image = Indian Parrot.jpg
| image_width = 270px
| image_width = 270px
| image_caption =భారతదేశంలో కనిపించే రామచిలుక
| image_caption =మకుటం పసుపుపచ్చగా గల అమెజాన్ ప్రాంత చిలుక<br />''Amazona ochrecephala ochrecephala''
| regnum = [[ఏనిమేలియా]]
| regnum = [[ఏనిమేలియా]]
| phylum = [[కార్డేటా]]
| phylum = [[కార్డేటా]]

00:49, 13 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

చిలుక
భారతదేశంలో కనిపించే రామచిలుక
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
సిట్టసిఫార్మిస్

Systematics

(but see below)

Family Cacatuidae (cockatoos)
Family Psittacidae (true parrots)

(paraphyletic)

ఇది ఒక జాతి చిలుక

చిలుక (చిలక) ఒక రంగుగల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ , సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) , కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా , దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు , చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని , చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి. చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

భారతదేశములో చిలుక

భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట ఉంది. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా చిలుకను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్తగా చూస్తే గాని చెప్పలేం.

భాషా విశేషాలు

తెలుగు భాషలో చిలుక పదానికి ముద్దుల చిలక, చిలక పలుకులు, అకుచిలక, గడ్డిచిలక, చిలుకలకొలికి లాంటి వివిధ ప్రయోగాలున్నాయి.[3]

వర్గీకరణ

ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడా జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

Rainbow Lorikeet
(T. h. moluccanus) perching on a garden fence in Australia
Skeleton of a parrot

ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.

  • జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,

కియ , కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.

  • తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో

ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్

  • ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
  • ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
  • ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్

ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు

ఇతర సూచీలు

మూలాలు

  1. "Psittacine". American Heritage Dictionary of the English Language, Fourth Edition. Houghton Mifflin Company. 2000. Retrieved 2007-09-09.
  2. "Psittacine". Merriam-Webster Online Dictionary. Merriam-Webster, Inc. Retrieved 2007-09-09.
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం చిలుక పదప్రయోగాలు.[permanent dead link]
  4. de Kloet, RS; de Kloet SR (2005). "The evolution of the spindlin gene in birds: Sequence analysis of an intron of the spindlin W and Z gene reveals four major divisions of the Psittaciformes". Molecular Phylogenetics and Evolution. 36 (3): 706–721. doi:10.1016/j.ympev.2005.03.013. PMID 16099384.
  5. Miyaki, Y.; Matioli, R.; Burke, T.; Wajntal, A. (1998). "Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence" (PDF). Molecular Biology and Evolution. 15 (5): 544–551.
"https://te.wikipedia.org/w/index.php?title=చిలుక&oldid=3168621" నుండి వెలికితీశారు