"క్రియాశీల శక్తి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో రంగారెడ్డి జిల్లా లింకు సవరణ, సమాచారపెట్టెలో జిల్లా పేరు వికారాబాదు జిల్లాగా మార్పు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (→‎top: AWB తో రంగారెడ్డి జిల్లా లింకు సవరణ, సమాచారపెట్టెలో జిల్లా పేరు వికారాబాదు జిల్లాగా మార్పు)
 
బణువులు మరీ నెమ్మదిగా ప్రయాణించినా, ఢీకొన్నప్పుడు అనుకూలమైన కోణంలో ఢీకొనకపోయినా రసాయన సంయోగం జరగదు; బంతులులా ఢీకొని, పరావర్తనం చెంది, మరో దిశలోకి వెళ్లిపోతాయి. బణువులు (1) కావలసినంత జోరుగా ప్రయాణం చేసి, (2) అనుకూలమైన కోణంలో ఢీకొని, (3) వాటి గతిజ శక్తి ఒక కనిష్ఠ అవధిని దాటినప్పుడు రసాయన సంయోగం జరుగుతుంది. ఆ కనిష్ఠ అవధిని క్రియాశీలక శక్తి (activation energy) అంటారు.
 
దీనికి ఒక చిన్న ఉపమానం. ఒక [[బండరాయి]]ని ఒక గుట్ట మీదకి లేవనెత్తి, ఆవలికి తొయ్యాలనుకుందాం. కొద్దిపాటి శక్తితో తోస్తే రాయి జరజరా వెనక్కి జారిపోతుంది. రాయిని ఆవలికి తొయ్యాలంటే శిఖరం దాటే వరకు బలంగా తొయ్యాలి. ఈ [[శిఖరం]] ఎత్తుని క్రియాశీలక శక్తితో పోల్చవచ్చు.
 
ఈ ఊహనాన్ని మరింత లోతుగా, ఒక ఉదాహరణ ద్వారా, పరిశీలించడానికి ఈ దిగువ చూపిన ఉత్క్రమణీయ (reversible) రసాయన ప్రక్రియని పరిశీలిద్దాం:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3209756" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ