వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పునరుక్తి తొలగింపు
ట్యాగు: 2017 source edit
→‎సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు: +వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు విభాగం
ట్యాగు: 2017 source edit
పంక్తి 21: పంక్తి 21:

ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
== వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు ==
వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రమౌఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరొధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.
== విషయ ప్రాముఖ్యత కోసం నిర్ధారించుకోదగ్గ మూలాలు ఆవశ్యకం ==
విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో, దండలో దారం లాంటి సాధారణ సూత్రం ఏమిటంటే, వ్యాస విషయానికి స్వతంత్ర వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చిందని ధృవీకరించుకోదగిన, వస్తుగతమైన ఆధారాలు ఉండాలి.

ఓ విషయం ఉనికిలో ఉన్నంత మాత్రాన, ఆటోమాటిగ్గా దానికి ప్రాముఖ్యత చేకూరినట్లు కాదు: ఆ విషయానికి స్వతంత్ర వనరుల్లో గణనీయమైన కవరేజి లేదా గుర్తింపు లభించిందని చూపించగలగాలి. ఇది ఏదో తాత్కాలిక గుర్తింపు కాకూడదు. ప్రాపగాండా కార్యకలాపాల్లో భాగంగా ఉండకూడదు. విచక్షణారహిత ప్రచారం కాకూడదు. వేరే ఏ ఇతర కారణాల వల్లనైనా అనుచితమైన విషయంగా పరిగణింపబడకూడదు. సాక్ష్యం యొక్క మూలాల్లో గుర్తించబడిన సాటివారి-సమీక్ష జరిగిన గుర్తింపు పొందిన ప్రచురణలు, విశ్వసనీయమైన, సాధికారిత కలిగిన పుస్తకాలు, ప్రశస్తి కలిగిన మీడియా వనరులు తదితర విశ్వసనీయ వనరులు ఆధారాలుగా పనికివస్తాయి.

ఏదైనా వ్యాసంలో ఉన్న కంటెంటుకు మూలాలను చూపించనంత మాత్రాన (మూలాలు అసలు ఉనికి లోనే లేకపోవడం కాదు) ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేనట్లు కాదు. విషయ ప్రాముఖ్యతకు కావలసినది విశ్వసనీయమైన, నిర్ధారించుకోదగ్గ, స్వతంత్ర వనరులు ఉనికిలో ఉండడం - అంతేగానీ, వాటిని వ్యాసంలో ఉల్లేఖించారా లేదా అనేది కాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను మదింపు చేసే సంపాదకులు వ్యాసంలో పేర్కొన్న మూలాలను మాత్రమే కాకుండా, వ్యాసంలో ఉల్లేఖించని ప్రాముఖ్యతను-సూచించే మూలాల ఉనికిని కూడా పరిగణించాలి. అందువల్లనే, తొలగింపు కోసం ఒక వ్యాసాన్ని ప్రతిపాదించడానికి ముందుగానీ, తొలగింపు చర్చలో అభిప్రాయాన్ని రాసే ముందుగానీ, సంపాదకులు సదరు విషయపు ప్రాముఖ్యతను నిర్ధారించగల మూలాలను కనుగొనే ప్రయత్నం చెయ్యాలని బలంగా ఉద్బోధిస్తాం.

వికీపీడియా వ్యాసాలను తుది ముసాయిదాగా భావించరాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే మూలాలను ప్రస్తుతానికి చూపించి ఉండక పోవచ్చు.., కానీ అవి ఉండే ఉండవచ్చు. ప్రాముఖ్యతను నిరూపించే, సముచితమైన మూలాలు లభించే అవకాశం ఉంటే, విషయ ప్రాముఖ్యత లేదని తొలగించడం సరికాదు. అయితే, విషయ ప్రాముఖ్యతను నిరూపించమని అడిగిన తరువాత, ఆ మూలాను చూపించవలసి ఉంటుంది, ఉన్నాయని లేదా ఉండే ఉంటాయని చెబితే సరిపోదు.

==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==

06:09, 10 జూన్ 2021 నాటి కూర్పు

వికీపీడియాలో ఓ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండొచ్చో లేదో నిర్ణయించడానికి పనికివచ్చే పరీక్ష, విషయ ప్రాముఖ్యత. వికీపీడియాలో ఉన్న సమాచారం నిర్ధారించుకోదగినదిగా ఉండాలి; విషయానికి సంబంధించి విశ్వసనీయమైన, స్వతంత్రమైన వనరులు దొరక్కపోతే, ఆ విషయానికి వ్యాసం ఉండకూడదు. వికీపీడియాలో విచక్షణారహితంగా వ్యాసాలను చేర్చకుండా ఉండటానికి ఈ మౌలిక సూత్రాన్ని వర్తింపజేస్తుంది. వ్యాసాలు, జాబితా వ్యాసాల విషయాలకు తప్పనిసరిగా విషయ ప్రాముఖ్యత ఉండాలి. కీర్తి, ప్రాముఖ్యత లేదా ప్రజాదరణ వంటివి విషయపు ప్రాముఖ్యతను పెంచుతాయేమొ గానీ పూర్తిగా వాటిపై ఆధారపడి ఉండదు.

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి

  1. కింద వివరించిన ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. లేదా ఆయా సబ్జెక్టులకు ప్రత్యేకంగా ఏమైనా మార్గదర్శకాలను విబ్వరించి ఉంటే వాటికి అనుగుణంగా ఉండాలి
  2. ఏది వికీపీడియా కాదు అనే విధానంలో చూపిన మినహాయింపుల్లో ఉండకూడదు.

ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు ఫలానా విషయానికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చునా అనేది చెబుతాయే తప్ప, ఆ వ్యాసంలో కంటెంటు ఏమి ఉండాలో, ఏం ఉండకూడదో చెప్పవు. ఆ సంగతిని వివరించేందుకు తటస్థ దృక్కోణం, నిర్ధారత్వం, మౌలిక పరిశోధనలు నిషిద్ధం, ఏది వికీపీడియా కాదు అనే మౌలిక నిబంధనలు ఉన్నాయి.

సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు

ఒక విషయానికి స్వతంత్రమైన, విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చినపుడు ఆ విషయానికి వికీపీడియాలో ప్రత్యేకమైన వ్యాసం ఉండవచ్చని భావిస్తారు.

  • గణనీయమైన కవరేజీ అంటే విషయం గురించి నేరుగా, వివరంగా చర్చించడం. ఎంత వివరంగా ఉండాలంటే అందులోని కంటెంటును సంగ్రహించాలంటే మౌలిక పరిశోధన చెయ్యాల్సిన అవసరం ఉండకూడదు. ఆ వనరుల్లో ఏదో ఒకటీ అరా చోట్ల, స్వల్పమైన ప్రస్తావన (ట్రివియల్ మెన్షన్) వస్తే అది గణనీయమైన కవరేజీ అని భావించరాదు. అయితే ఆ మూల వ్యాసానికి ఇదే ప్రధాన విషయం కావాల్సిన అవసరం లేదు.
    • విప్లవ రచయితల సంఘం గురించి సాక్షి దినపత్రికలో ప్రత్యేకంగా వచ్చిన వ్యాసం ఆ వ్యాస విషయ ప్రాముఖ్యతను వివరించేందుకు సరిపోతుంది.
    • పై వ్యాసంలో "గా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది." అనే వాక్యం ఉన్నంత మాత్రాన బయ్యక్కకు విషయ ప్రాముఖ్యత ఉన్నట్టు కాదు.
  • "విశ్వసనీయమైన" అంటే విశ్వసనీయమైన మూలాల మార్గదర్శకానికి అనుగుణంగా ఉండే సమగ్రత, ప్రాశస్త్యం ఉన్న మూలాలు అని అర్థం. ఈ మూలాలు ఏ రూపంలో/ఏ మాధ్యమంలో నైనా, ఏ భాషలోనైనా ప్రచురితమై ఉండవచ్చు. విషయాన్ని కవర్ చేసే ద్వితీయ స్థాయి మూలాలైతే మరీ మంచిది.
  • "వనరులు" [1] ద్వితీయ స్థాయి మూలాలై ఉండాలి. ఎందుకంటే అవి విషయ ప్రాముఖ్యతకు సంబంధించి అత్యుత్తమ వస్తుగత సాక్ష్యాలను అందిస్తాయి. మూలాలు నాణ్యత లోను, కవరేజి లోతులోనూ తేడాలు ఉంటాయి కాబట్టి, మూలాలు ఎన్ని ఉఅండాలి అనే వుషయంలో ఇదమిత్థమైన సంఖ్య అంటూ లేదు. కాని అనేక వనరులు ఉంటే బాగుంటుంది. [2] ఈ వనరులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు. తెలుగు లోనే ఉండాలని కూడా ఏమీ లేదు. ఒకే రచయిత రాసినవీ లేదా ఒకే సంస్థ ప్రచురించినవీ అయిన ప్రచురణలను ఒకే మూలంగా పరిగణిస్తారు.
  • "విషయానికి సంబంధించినవి కాకుండా స్వతంత్రమైనవి" అంటే వ్యాస విషయం గానీ, దానికి సంబంధించిన వారు గానీ చేసిన రచనలు. ఇవి విషయ ప్రాముఖ్యత నిరూపించే మూలాలుగా అంగీకరించబడవు. ఉదాహరణకు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, ఆత్మకథలు, వ్యాస విషయానికి చెందిన వెబ్‌సైటు మొదలైనవి స్వతంత్ర వనరులుగా పరిగణించబడవు. [3]
  • "భావిస్తారు" అని ఎందుకు అన్నారంటే.. విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజి ఉన్నంత మాత్రాన దానికి వ్యాసం కచ్చితంగా ఉండాలి అనే హామీ ఏమీ లేదు, ఉండవచ్చు అనే సంభావ్యతను మాత్రమే ఇది సూచిస్తుంది. మరింత లోతైన చర్చ జరిగితే ఈ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండనక్కరలేదు అని తేలవచ్చు. బహుశా ఏది వికీపీడియా కాదు అనే పేజీలో చెప్పిన మినహాయింపులకు లోబడి లేకపోయి ఉండవచ్చు. [4]

ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.

వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు

వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రమౌఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరొధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.

విషయ ప్రాముఖ్యత కోసం నిర్ధారించుకోదగ్గ మూలాలు ఆవశ్యకం

విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో, దండలో దారం లాంటి సాధారణ సూత్రం ఏమిటంటే, వ్యాస విషయానికి స్వతంత్ర వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చిందని ధృవీకరించుకోదగిన, వస్తుగతమైన ఆధారాలు ఉండాలి.

ఓ విషయం ఉనికిలో ఉన్నంత మాత్రాన, ఆటోమాటిగ్గా దానికి ప్రాముఖ్యత చేకూరినట్లు కాదు: ఆ విషయానికి స్వతంత్ర వనరుల్లో గణనీయమైన కవరేజి లేదా గుర్తింపు లభించిందని చూపించగలగాలి. ఇది ఏదో తాత్కాలిక గుర్తింపు కాకూడదు. ప్రాపగాండా కార్యకలాపాల్లో భాగంగా ఉండకూడదు. విచక్షణారహిత ప్రచారం కాకూడదు. వేరే ఏ ఇతర కారణాల వల్లనైనా అనుచితమైన విషయంగా పరిగణింపబడకూడదు. సాక్ష్యం యొక్క మూలాల్లో గుర్తించబడిన సాటివారి-సమీక్ష జరిగిన గుర్తింపు పొందిన ప్రచురణలు, విశ్వసనీయమైన, సాధికారిత కలిగిన పుస్తకాలు, ప్రశస్తి కలిగిన మీడియా వనరులు తదితర విశ్వసనీయ వనరులు ఆధారాలుగా పనికివస్తాయి.

ఏదైనా వ్యాసంలో ఉన్న కంటెంటుకు మూలాలను చూపించనంత మాత్రాన (మూలాలు అసలు ఉనికి లోనే లేకపోవడం కాదు) ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేనట్లు కాదు. విషయ ప్రాముఖ్యతకు కావలసినది విశ్వసనీయమైన, నిర్ధారించుకోదగ్గ, స్వతంత్ర వనరులు ఉనికిలో ఉండడం - అంతేగానీ, వాటిని వ్యాసంలో ఉల్లేఖించారా లేదా అనేది కాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను మదింపు చేసే సంపాదకులు వ్యాసంలో పేర్కొన్న మూలాలను మాత్రమే కాకుండా, వ్యాసంలో ఉల్లేఖించని ప్రాముఖ్యతను-సూచించే మూలాల ఉనికిని కూడా పరిగణించాలి. అందువల్లనే, తొలగింపు కోసం ఒక వ్యాసాన్ని ప్రతిపాదించడానికి ముందుగానీ, తొలగింపు చర్చలో అభిప్రాయాన్ని రాసే ముందుగానీ, సంపాదకులు సదరు విషయపు ప్రాముఖ్యతను నిర్ధారించగల మూలాలను కనుగొనే ప్రయత్నం చెయ్యాలని బలంగా ఉద్బోధిస్తాం.

వికీపీడియా వ్యాసాలను తుది ముసాయిదాగా భావించరాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే మూలాలను ప్రస్తుతానికి చూపించి ఉండక పోవచ్చు.., కానీ అవి ఉండే ఉండవచ్చు. ప్రాముఖ్యతను నిరూపించే, సముచితమైన మూలాలు లభించే అవకాశం ఉంటే, విషయ ప్రాముఖ్యత లేదని తొలగించడం సరికాదు. అయితే, విషయ ప్రాముఖ్యతను నిరూపించమని అడిగిన తరువాత, ఆ మూలాను చూపించవలసి ఉంటుంది, ఉన్నాయని లేదా ఉండే ఉంటాయని చెబితే సరిపోదు.

ఇవీ చూడండి

మూలాలు

  1. Including but not limited to newspapers, books and e-books, magazines, television and radio documentaries, reports by government agencies, and academic journals. In the absence of multiple sources, it must be possible to verify that the source reflects a neutral point of view, is credible and provides sufficient detail for a comprehensive article.
  2. Lack of multiple sources suggests that the topic may be more suitable for inclusion in an article on a broader topic. It is common for multiple newspapers or journals to publish the same story, sometimes with minor alterations or different headlines, but one story does not constitute multiple works. Several journals simultaneously publishing different articles does not always constitute multiple works, especially when the authors are relying on the same sources, and merely restating the same information. Similarly, a series of publications by the same author or in the same periodical is normally counted as one source.
  3. Works produced by the subject, or those with a strong connection to them, are unlikely to be strong evidence of notability. See also: Wikipedia:Verifiability#Questionable sources for handling of such situations.
  4. Moreover, not all coverage in reliable sources constitutes evidence of notability for the purposes of article creation; for example, directories and databases, advertisements, announcements columns, and minor news stories are all examples of coverage that may not actually support notability when examined, despite their existence as reliable sources.