రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: uk:Рамадан
చి roboto: id:Ramadhan estas artikolo elstara
పంక్తి 77: పంక్తి 77:
[[he:רמדאן]]
[[he:רמדאן]]
[[hr:Ramazan]]
[[hr:Ramazan]]
[[id:Ramadhan]]
[[id:Ramadhan]] {{Link FA|id}}
[[is:Ramadan]]
[[is:Ramadan]]
[[it:Ramadan]]
[[it:Ramadan]]

00:39, 19 జూలై 2008 నాటి కూర్పు

'రంజాన్ లేదా రమదాన్ (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్ లో ఒక ‌నెల పేరు.

పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '

ఉపవాసవ్రతం

ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్ గ్రంథం .


" విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో.......... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి' అని పేర్కొంది.

నిష్ట నియమాలు

రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా ' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరిమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ' సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే! దీనిని ఖురాన్ ' తఖ్వా' అని అంటుంది.

ఉపవాస విధి

రంజాన్ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తినెలరోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది.

ఏతెకాఫ్

ఈ విధంగా అత్యంత నిష్టనియమాలతో ఉపవాసదీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్ళు నమాజులో లీనమై వుంటారు. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇఫా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాల ' తరావీహ్' నమాజ్ చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు. రంజాన్ నెల 21వ రోజు నుంచి చివరివరకూ ఒక ప్రత్యేకత వుంది. అదే ' ఏతెకాఫ్ ' . 'ఏతెకాఫ్ ' అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించదలచినవారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నమయివుంటారు. ఈ సమయంలో ' ఏతెకాఫ్ ' వున్నవారు బలమైన కారణం వుంటే తప్ప మస్జిద్ వదిలి బయటకు పోకూడదు.

షబ్-ఎ-ఖద్ర్

రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.

జకాత్

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.

ఫిత్రా

'జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది వున్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుంది.

దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.

షవ్వాల్

ఈ విధంగా రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే '...... ' షవ్వాల్' ' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తూనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి....... మరుసటి రోజు ' రంజాన్ ' పండుగను అత్యంత భక్తిశ్రద్థలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. " షవ్వాల్' నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ' ఈదుల్‍ఫితర్ ' అని అంటారు.

ఇఫ్తార్ విందు

ఈద్‍ముబారక్

ఈ పండుగను పేద , ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతె ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‍గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ' ఈద్‍ముబారక్ ' ( శుభాకాంక్షలు) తెలుపుకుంటారు.

ఇఫ్తార్ విందు

ఈ నెలలో జరిగే ' ఇఫ్తార్ విందు ' ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయి. పరస్పర ధోరణికి , విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.

ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది.


మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=రంజాన్&oldid=323663" నుండి వెలికితీశారు