అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విభాగాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Abul Hasan Qutb Shah.jpg|thumb|right|అబుల్ హసన్ కుతుబ్ షా]]
[[బొమ్మ:Abul Hasan Qutb Shah.jpg|thumb|right|అబుల్ హసన్ కుతుబ్ షా]]
'''తానీషా''' (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.
'''తానీషా''' (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] మూడవ అల్లుడు. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.


==పరమత సహనం==
==పరమత సహనం==
పంక్తి 7: పంక్తి 6:


==గోల్కొండ పతనం==
==గోల్కొండ పతనం==
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, [[అబ్దుల్లా కుతుబ్ షా]]ను దక్కన్లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] సేనానిగా ఉన్న [[ఔరంగజేబు]] ఓడించి [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[షాజహాను]] యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. [[1683]] ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యయవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ [[1687]] అక్టోబర్ చివర్లో ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి [[దౌలతాబాదు]] కోటలో మరణించేవరకు బంధించి ఉంచారు.
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, [[అబ్దుల్లా కుతుబ్ షా]]ను దక్కన్లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] సేనానిగా ఉన్న [[ఔరంగజేబు]] ఓడించి [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[షాజహాను]] యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. [[1683]] ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యయవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ [[1687]] అక్టోబర్ చివర్లో ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి [[దౌలతాబాదు]] కోటలో 13 సంవత్సరాలు (అనగా క్రీ.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.


తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో [[నిజాం]] పాలన ప్రారంభమయ్యింది.
తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో [[నిజాం]] పాలన క్రీ.శ. [[1701]] నుండి ప్రారంభమయ్యింది.


[[బొమ్మ:TaanIshaa.jpg|thumb|right|అబుల్ హసన్ కుతుబ్ షా ]]
[[బొమ్మ:TaanIshaa.jpg|thumb|right|అబుల్ హసన్ కుతుబ్ షా ]]

10:17, 31 జూలై 2008 నాటి కూర్పు

అబుల్ హసన్ కుతుబ్ షా

తానీషా (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు అబ్దుల్లా కుతుబ్ షా మూడవ అల్లుడు. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు.

పరమత సహనం

ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు మరియు సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా హనుమకొండకు చెందిన మాదన్న అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు రామదాసు (కంచర్ల గోపన్న)ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందాడు. పాల్వంచ తాలూకా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమిస్తాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా భద్రాచలములో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగిస్తాడు. ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధిస్తాడు. కథనం ప్రకారం ఆ తరువాత రామలక్షణులు తానీషాకు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇవ్వగా గోపన్నను విడుదల చేస్తాడు. రామదాసుకు తానీషా చూపిన సహృదయతకు గాను తెలుగు ప్రజలు తానీషాను నేటికీ కొనయాడుతారు.

గోల్కొండ పతనం

తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. 1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యయవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ చివర్లో ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి దౌలతాబాదు కోటలో 13 సంవత్సరాలు (అనగా క్రీ.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.

తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో నిజాం పాలన క్రీ.శ. 1701 నుండి ప్రారంభమయ్యింది.

అబుల్ హసన్ కుతుబ్ షా
అబుల్ హసన్ కుతుబ్ షా