కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి ఈ మండలానికి చెందని గ్రామం తొలగించాను |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
# [[ముజాహిద్పుర్]] |
# [[ముజాహిద్పుర్]] |
||
# [[అల్లాపూర్ (కుల్కచర్ల)|అల్లాపూర్]] |
# [[అల్లాపూర్ (కుల్కచర్ల)|అల్లాపూర్]] |
||
# [[మక్తా వెంకటాపూర్ (కుల్కచర్ల మండలం)|మక్తా వెంకటాపూర్]] |
|||
# [[తిరుమలాపూర్ (కుల్కచర్ల)|తిరుమలాపూర్]] |
# [[తిరుమలాపూర్ (కుల్కచర్ల)|తిరుమలాపూర్]] |
||
# [[ఇప్పాయిపల్లి]] |
# [[ఇప్పాయిపల్లి]] |
||
పంక్తి 52: | పంక్తి 51: | ||
# [[అనంతసాగర్ (కుల్కచర్ల)|అనంతసాగర్]] |
# [[అనంతసాగర్ (కుల్కచర్ల)|అనంతసాగర్]] |
||
# [[కుసుమసముద్రం]] |
# [[కుసుమసముద్రం]] |
||
{{Div end}} |
{{Div end}} |
||
==మూలాలు== |
==మూలాలు== |
03:19, 22 ఆగస్టు 2021 నాటి కూర్పు
కుల్కచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
కుల్కచర్ల | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | కుల్కచర్ల |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 70,281 |
- పురుషులు | 35,780 |
- స్త్రీలు | 34,501 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.40% |
- పురుషులు | 48.44% |
- స్త్రీలు | 24.02% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. ఈ మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
గణాంకాలు
2011 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారం 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.
మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.
మండలంలోని పాఠశాలలు, కళాశాలలు
మండలంలో 92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.
వర్షపాతం, నీటిపారుదల
మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూలై మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.
వ్యవసాయం, పంటలు
మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ, కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[2] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.
మండలంలోని దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు
ప్రముఖ శివాలయం పాంబండ గ్రామంలో, రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.