జి. కుమార పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"G. Kumara Pillai" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

14:43, 8 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

జి. కుమార పిళ్లై (22 ఆగష్టు 1923 - 16 ఆగష్టు 2000) ఒక మలయాళ భాషా కవి, వ్యాసకర్త. ఇతను దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. అతను పూర్తిగా గాంధేయవాది. ఇంకా కేరళలోని అనేక మానవ హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నాడు. అతను కవి, రచయత, తమ రచనలకు అవార్డులు అందుకున్నాడు. కేరళ రాష్ట్రంలో అనేక రచయతలు ఆంగ్లం లో ఆచార్యులు గా కూడా ఉన్నారు. వారిలో ఒకరు జి. కుమార పిళ్లై. <https://timesofindia.indiatimes.com/city/kochi/sense-and-sentience/articleshow/78070445.cms >

జీవిత చరిత్ర

అతను ప్రస్తుత కేరళలోని కొట్టాయం జిల్లాలోని వెన్నిమలలో 22 ఆగష్టు 1923 న పెరింగర పి.గోపాల పిళ్లై, పార్వతి అమ్మ కుమారుడిగా జన్మించాడు. అతను చంగనాస్సేరీలోని SB కళాశాల నుండి తన విద్యను పూర్తి చేసాడు. బొంబాయిలోను తరువాత కేరళ సచివాలయంలో గుమస్తాగా పనిచేశాడు. అతను నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. [1] అతను తిరువనంతపురం విశ్వవిద్యాలయ కళాశాల లో ఆంగ్ల భాషాచార్యులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేశాడు. అతడికి సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, అలప్పుజ్హ కు చెందిన మాజీ ఆచార్యురాలు లీల ను వివాహం చేసుకున్నాడు.

అతను స్వాతంత్య్ర సమరయోధుడు. 1944-46 కాలంలో కొచ్చి ప్రజామండలం సభ్యుడు కూడా. [1] అతను తన జీవితమంతా గాంధేయవాది గా ఉన్నాడు. కేరళలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో ముందు వరుసలో పాల్గొన్నాడు. రాష్ట్రంలోని మద్యం విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాడు. అతను పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) అను వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అతను దాని కేరళ విభాగానికి ప్రారంభ రోజుల్లో అధ్యక్షుడిగాను, 1980 నుండి 1996 వరకు దాని జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. అతనికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క ఇండియా చాప్టర్‌తో కూడా సంబంధం ఉంది. [2]

అతను దాదాపు 20 పుస్తకాలను రచించాడు. ఆయన 1985 లో "సప్తస్వరం" అనే కవితా రచన కోసం కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం ను అందుకున్నారు. [3] మళయాళ చిత్ర దర్శకుడు జి. అరవిందన్ చిత్రం ఉత్తరాయణం లోని "హృదయదిన రొమాంజం" అను పాటకు ఆయన సాహిత్యం అందించారు.

అతను 2000 ఆగస్టు 16 న త్రిస్సూర్‌లో మరణించాడు. [1]

రచనలు

అతని రచనలలో కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.

  • అరలి పూక్కల్ (1951) -అతడు ప్రచురించిన మొదటి కవితా సంకలనం [1]
  • మరుభూమియుడే కినవుకల్
  • ఓర్మాయుడే సుగంధం
  • సప్తస్వరం
  • బేబీ కాంప్బెల్ ఎంప్టీ క్యూబ్ 2 (Baby Campbell Empty Cube Two) (జనవరి 2001)
  • ఇన్నం ఇన్నాలేయుం నాళేయుమ్ (1999)
  • ఎ బుక్ ఆఫ్ మోడర్న్ షార్ట్ స్టొరీస్ (1977) <https://www.amazon.in/Books-G-Kumara-Pillai/s?rh=n%3A976389031%2Cp_27%3AG.Kumara+Pillai>

పురస్కారాలు

  • 1984: సప్తస్వరానికి ఒడక్కుజల్ పురస్కారం
  • 1985: సప్తస్వరానికి కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం
  • ఆశన్ పురస్కారం [1]

ప్రస్తావనలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "പ്രൊഫ.ജി.കുമാരപിള്ള അന്തരിച്ചു". malayalam.oneindia (in మలయాళం). 2000-08-17.
  2. "Obituary". People's Union for Civil Liberties (PUCL). Retrieved 12 April 2014.
  3. "Kerala Sahitya Akademi Awards". Kerala Sahitya Akademi. Retrieved 12 April 2014.