ఆజాద్ హింద్ ఫౌజ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
499 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
→‎మూలాలు: మరిన్ని మూలాల చేర్పు, కొన్నిటి సవరణ
(→‎మూలాలు: కొన్ని మూలాల సవరణ, కొన్నిటి చేర్పు)
(→‎మూలాలు: మరిన్ని మూలాల చేర్పు, కొన్నిటి సవరణ)
== మొదటి INA ==
[[దస్త్రం:Fujiwara_Kikan.jpg|కుడి|thumb|200x200px| మేజర్ ఇవైచి ఫుజివారా మోహన్ సింగ్‌ను పలకరించారు. 1942 ఏప్రిల్.]]
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు, బహిష్కరించబడిన భారతీయ జాతీయవాదులకు జపాన్, ఆగ్నేయ ఆసియాలు ప్రధానమైన ఆశ్రయ కేంద్రాలు. దక్షిణ ఆసియాలో మలయన్ సుల్తానులు, విదేశీ చైనీయులు, బర్మా ప్రతిఘటన, [[భారత స్వాతంత్ర్యోద్యమం|భారతీయ స్వాతంత్ర్య ఉద్యమం]] ల మద్దతు సేకరించేందుకు జపాన్, మేజర్. ఇవైచి ఫుజివారా నాయకత్వంలో ఇంటెలిజెన్స్ రాయబారాలను పంపింది. మినామి కికన్ విజయవంతంగా బర్మీస్ జాతీయవాదులను కలుపుకుంది. ఎఫ్ కికాన్ థాయ్‌లాండ్, మలయాలో ప్రవాసంలో ఉన్న భారతీయ జాతీయవాదులతో పరిచయాలను ఏర్పరచుకోవడంలో విజయం సాధించింది. <ref name="Lebra 1977 23">{{Harvnb|Lebra|1977|p=23}}</ref><ref name="Lebra 1977 24" >{{Harvnb|Lebra|1977|p=24}}</ref> ఫుజివారా, విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని అతని కార్యాలయం ప్రవాస జాతీయవాద నాయకులకు తెలియజేయాల్సిన విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా చెప్పబడిందిచెప్పింది. అతడికి వారినుండి ఆమోదం లభించింది . <ref name="Lebra 1977 242">{{Harvnb|Lebra|1977|p=24}}</ref><ref name="Fay 1993 75">{{Harvnb|Fay|1993|p=75}}</ref> తరువాతి కాలంలో అతను తనను తాను "లారెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ" (లారెన్స్ ఆఫ్ అరేబియా లాగా) అని అభివర్ణించుకున్నాడు. తొలుత అతను జియాని ప్రీతమ్ సింగ్, థాయ్-భారత్ కల్చరల్ లాడ్జ్ లను కలిసాడు. <ref name="Lebra 1977 24243" >{{Harvnb|Lebra|1977|p=24}}</ref> ఆగ్నేయాసియాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, 70,000 మంది భారత సైనికులు (ఎక్కువగా సిక్కులు ) మలయాలో ఉన్నారు. మలయన్ యుద్ధంలో జపాన్ సాధించిన అద్భుతమైన విజయంలో సింగపూర్ పతనం తరువాత దాదాపు 45,000 మంది భారతీయులతో సహా అనేక మంది యుద్ధ ఖైదీలు పట్టుబడ్డారు. బ్రిటిష్-ఇండియన్ ఆర్మీలో సేవా పరిస్థితులు, మలయాలోని సామాజిక పరిస్థితులు ఈ దళాల్లో విభేదాలకు దారితీశాయి. ఈ ఖైదీల నుండే, మొట్టమొదటి భారత జాతీయ సైన్యం మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పడింది. సింగ్ బ్రిటిష్-ఇండియన్ ఆర్మీలో అధికారి. అతను మలయన్ యుద్ధం ప్రారంభంలో పట్టుబడ్డాడు. అతని జాతీయవాద భావాల వల్ల ఫుజివారాలో ఒక మిత్రుడిని చూసాడు. అతనికి జపనీయుల నుండి గణనీయమైన సహాయం, మద్దతు లభించింది. ఆగ్నేయాసియాలోని భారతీయులు కూడా భారత స్వాతంత్ర్యానికి మద్దతునిచ్చారు. యుద్ధానికి ముందే వారు మలయాలో స్థానిక లీగ్‌లను ఏర్పాటు చేశారు. ఆక్రమణ తరువాత జపాన్ ప్రోత్సాహంతో ఇవన్నీ కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (IIL) ఏర్పడింది.
 
ఐఐఎల్‌లో అనేక మంది ప్రముఖ భారతీయ భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధం నుండీ జపాన్‌లో స్వీయ బహిష్కరణలో నివసిస్తూ ఉన్న భారతీయ విప్లవకారుడు [[రాస్‌ బిహారి బోస్‌|రాష్ బిహారీ బోస్‌]]<nowiki/>పై నాయకత్వం పడింది. లీగ్, INA నాయకత్వం రెండూ కూడా INA, IIL కు లోబడి ఉండాలని నిర్ణయించాయి. లీగ్ యొక్క ప్రముఖ సభ్యులు, INA నాయకులు సభ్యులుగా ఒక వర్కింగ్ కౌన్సిల్‌ ఏర్పాటౌతుంది. INA ను యుద్ధానికి పంపే అంశాలపై ఈ వర్కింగ్ కైన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. తాము జపాను వారి కీలుబొమ్మలుగా కనిపిస్తామేమోనని భయపడిన భారతీయ నాయకులు దాన్ని నివారించేందుకు గాను, [[భారత జాతీయ కాంగ్రెస్]] పిలుపునిచ్చినప్పుడు మాత్రమే INA యుద్ధానికి వెళుతుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. జపాను వారిని జోక్యం చేసుకోమనే హామీలు ఇవ్వాలని కోరారు. వీటికే బిరాదరీ తీర్మానాలు అని పేరు. అవి ఓ స్వతంత్ర ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందం లాంటివి. ఈ సమయంలో, ఎఫ్. కికాన్ స్థానంలో హిడియో ఇవాకురో నేతృత్వంలోని ఇవాకురో కికన్ ఏర్పాటైంది. లీగ్‌తో ఇవాకురో సంబంధాలు మరింత బలహీనంగా ఉండేవి. బిరాదరీ తీర్మానాల నుండి ఉత్పన్నమైన డిమాండ్లకు జపాన్ వెంటనే అంగీకరించలేదు. రాష్ బిహారీకి, లీగ్‌కూ మధ్య కూడా విభేదాలు ఉండేవి. ఎందుకంటే రాష్ బిహారీ జపాన్‌లో చాలాకాలం పాటు నివసించాడు.నివసించాడనో, అతనికి జపనీస్ భార్య, జపాను సైన్యంలో పనిచేస్తున్న కుమారుడూ ఉన్నారుఉన్నారనో కాదు. <ref name="Lebra2008p49">{{Harvnb|Lebra|2008|p=49}}</ref> మరోవైపు, సైనిక వ్యూహ సంబంధ నిర్ణయాలు INA స్వయంప్రతిపత్త నిర్ణయాలుగా ఉండాలని, లీగ్‌కు సంబంధం ఉండకూడదనీ మోహన్ సింగ్ ఆశించాడు.<ref name="Fay150">{{Harvnb|Fay|1993|p=150}}</ref>
 
1942 నవంబరు డిసెంబరు ల్లో, INA పట్ల జపానుకున్న ఉద్దేశాల గురించి తలెత్తిన ఆందోళన కారణంగా INA, లీగ్‌ల మధ్య ఓవైపు, INA, జపనీయుల మధ్య మరో వైపూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. INA నాయకత్వం లీగ్ (రాష్ బిహారీ మినహా) నుండి రాజీనామా చేసింది. 1942 డిసెంబరులో మోహన్ సింగ్ సైన్యాన్ని రద్దు చేసాడు. INA దళాలను యుద్ధ ఖైదీల శిబిరాలకు తిరిగి రావాలని అతను ఆదేశించాడు. <ref name="Toye452">{{Harvnb|Toye|1959|p=45}}</ref><ref name="Fay149">{{Harvnb|Fay|1993|p=149}}</ref> మోహన్ సింగ్‌ను కాల్చి చంపాలని భావించారు. <ref name="Toye45" >{{Harvnb|Toye|1959|p=45}}</ref>
 
1942 డిసెంబరు, 1943 ఫిబ్రవరి ల మధ్య, రాష్ బిహారీ INA ను నిలిపి ఉంచడానికి చాలా కష్టపడ్డాడు. 1943 ఫిబ్రవరి 15 న సైన్యాన్ని లెఫ్టినెంట్ కల్నల్ M.Z కియాని ఆధీనంలో పెట్టారు. <ref>{{Cite web|url=http://wn.com/Lt_Col_M_Z_Kiani|title=MZ Kiani|publisher=World News|access-date=2011-08-12}}</ref> లెఫ్టినెంట్ కల్నల్ జెఆర్ భోంస్లే (మిలటరీ బ్యూరో డైరెక్టర్) ఇన్‌చార్జిగా విధాన నిర్ణాయక సంస్థను ఏర్పరచారు. స్పష్టంగా దీన్ని IIL ఆధిపత్యంలో ఉంచారు. భోంస్లే కింద జనరల్ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ కల్నల్. షా నవాజ్ ఖాన్, మిలిటరీ సెక్రటరీగా మేజర్ పికె సహగల్, ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ కమాండెంట్‌గా మేజర్ హబీబ్ ఉర్ రహమాన్, ఉద్బోధ, సంస్కృతి లకు అధిపతిగా లెఫ్టినెంట్ కల్నల్. AC ఛటర్జీ (తరువాత మేజర్ AD జహంగీర్) ఉన్నారు. <ref name="Fay151">{{Harvnb|Fay|1993|p=151}}</ref><ref name="Lebra2008p98">{{Harvnb|Lebra|2008|p=98}}</ref>
 
== రెండవ INA ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3378141" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ