"పొదుపు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
;ప్రభుత్వ పథకాలు:
ఆర్థిక వ్యవస్థలో పొదుపు అవసరమైనప్పుడు ప్రభుత్వం పొదుపునకు ప్రాత్సాహం కల్పించడానికి వడ్డీరేట్లను పెంచుతుంది. ఇవి సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వాలు తీసుకొనే సాధారణ చర్యలు. ప్రభుత్వాలు కల్పించే అనేక సబ్సిడీ పథకాలు కూడా వ్యక్తుల వినియోగ ఖర్చులను తగ్గించి పొదుపును పెంచుతాయి.
 
==పొదుపు వైపరీత్యం==
సాధారణంగా పొదుపు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. పొదుపు వలన పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం వలన పరిశ్రమలు అధికంగా స్థాపించబడి కార్మికులను ఉపాధి అవకాశాలు అధికమౌతాయి. కాని ఇవి నాణేనికి ఒకవైపు మాత్రమే. స్వల్పకాలంలో పొదుపు లాభకరమైనప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే అర్థిక వ్యవస్థకు పొదుపు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకామలో అధిక పొదుపు వలన వస్తుసేవల యొక్క డిమాండు పడిపోయి సంస్థలు ఉత్పత్తి తగ్గించే దశ రావచ్చు. అదే జరిగితే పరిశ్రమలలో కార్మికుల సంఖ్య తగ్గి నిరుద్యోగాలు పెరగవచ్చు. స్థూలంగా ఆర్థిక వ్యవస్థ సంక్ష్యోభంలోకి కూరుకుపోతుంది. దీన్నేఆర్థికవేత్తలు పొదుపు వైపరీత్యంగా పిలుస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[పెట్టుబడి]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338091" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ