జాంబవంతుడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4,478 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
విస్తరణ కొంచెంగా
(కొత్త పేజీ: '''జాంబవంతుడు''' బ్రహ్మ ఆవులించడా పుట్టిన భల్లూకరాజు. [[వర్గం:పు...)
 
(విస్తరణ కొంచెంగా)
'''జాంబవంతుడు''' [[బ్రహ్మ]] ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. [[రామాయణం]]లో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన [[సుందర కాండ]], [[యుద్ధకాండ]]లలో తరచు వస్తుంది. ముఖ్యంగా ్నుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది.
'''జాంబవంతుడు''' [[బ్రహ్మ]] ఆవులించడా పుట్టిన భల్లూకరాజు.
 
సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
 
[[యుద్ధకాండ]]లో సారణుడనే రాక్షస చారుడు [[రావణుడు|రావణునికి]] జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మా జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి శిఖరం మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన పర్వతాకఅరుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."
 
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు -
మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం [[విభీషణుడు]], [[హనుమంతుడు]] వెదుకసాగారు. అప్పుడు [[జాంబవంతుడు]] కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో [[వాయువు]]తోనూ, పరాక్రమములో [[అగ్ని]]తోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది [[మృత సంజీవని]], విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
 
 
==వనరులు==
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338834" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ