"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
నాసాతో చర్చలు జరిపిన అనంతరం కేవలం శాటిలైట్లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కలిగిఉండడం ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఇస్రోతో కలసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదిక అయిన లాంచింగ్ ప్యాడ్ రూపకల్పన మొదలు పెట్టారు. దానిపేరే Satellite Launch Vehicle (SLV).
మరొక వైపు ఇస్రో పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా, దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టబడింది. [[భారతదేశం | భారతదేశపు ]]మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను [[ఏప్రిల్ 19]], [[1975]]న అప్పటి [[సోవియట్ యూనియన్]] నుండి విజయవంతంగా ప్రయోగించారు.
1979 నాటికి [[శ్రీహరి కోటశ్రీహరికోట]]లో SLV లాంచ్ ప్యాడ్ సిద్దమవడంతో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి -1 [[భారతదేశం]]లో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.
 
===1980-1990===
SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా Polar Satellite Launch Vehicle (PSLV) నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. [[1987]]లొ మరియు [[1988]]లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు.
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/341673" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ