రాజయోగం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
821 బైట్లు చేర్చారు ,  5 నెలల క్రితం
* స్టంట్స్: కె.మాధవన్
==సంక్షిప్తకథ==
ప్రచండసేన మహారాజుకు రత్నాంగి అనే భార్య, విజయుడు,సుగుణ అనే పిల్లలు ఉంటారు. ప్రజలకు మహారాజే దైవమని తనను మించిన శక్తి మరేదీలేదని ప్రచండుడు నూరిపోశాడు. దైవమే సర్వానికీ కారణమని నమ్ముకున్న రత్నాంగికీ, మహారాజు ప్రచండసేనునికీ విధి మీద వాదం నడుస్తుంది. విధి గొప్పో, తాను గొప్పో నిరూపించడానికి మహారాజు రాణినీ, పిల్లలనూ వేరుచేస్తాడు. విడిపోయిన భార్యాబిడ్డలు తలో దారి పడతారు. తన మేనల్లుడు విక్రముడిని గొప్పవీరునిగా తయారుచేసి తన రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని రాజు తన చెల్లెలికి వాగ్దానం చేస్తాడు. రాకుమారుడు విజయుడు సాగరయ్య పేరుతో ఒక బెస్తవాని ఇంటిలో పెరిగి పెద్దవాడౌతాడు. రాకుమార్తె సుగుణ ఒక నర్తకి ఇంటిలో రంజని పేరుతో పెరి పెద్దదై నర్తకిగా పేరు గడించుకుంటుంది. భర్తకు దూరమైన రత్నాంగి పిల్లలను పోగొట్టుకుని వరహాలసెట్టి ఇంట్లో దాసిగా పనిచేస్తూ ఉంటుంది. మేనల్లుడైన విక్రముడు విద్యాబుద్ధులు నేర్చుకుని తగిన సమర్థుడైనాడని రాజు మురిసిపోతాడు. ఐతే వాడొక ధూర్తుడిగా మారతాడు. మహారాజు కొలువులో జరిగిన పోటీలలో సాగరయ్య గెలిచి మహారాజు మెప్పుపొందుతాడు. అదే కొలువులో అవకాశం లభించగా రంజని నాట్యప్రదర్శన గావించి మహారాజు మన్ననలను పొందుతుంది. విక్రముడు తన మేనమామ మహారాజును బంధిస్తాడు. మంత్రి మణిమంతుడు మహారాజును విడుదల చేస్తాడు. అక్కడి నుండి తప్పించుకున్న మహారాజు అరణ్యంలో ఒక ముని శాపం వల్ల మతిపోగొట్టుకుంటాడు. విక్రముడు తన తల్లిని తీర్థయాత్రలకు పంపిస్తాడు. విక్రముని బారిన పడిన రంజనిని సాగరయ్య రక్షిస్తాడు. తల్లీ తండ్రీ పిల్లలు అందరూ ఒకేచోట కలుసుకుంటారు. కానీ ఒకరికొకరు గుర్తుపట్టలేక పోతారు.
 
==పాటలు==
67,847

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3454339" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ