అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు: రోమను లిపిలో సైట్ల గురించి రాసాను
పంక్తి 13: పంక్తి 13:


=== తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు ===
=== తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు ===
తెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ తెలుసా లిస్ట్ <ref>{{Cite web|url=http://www.bhaavana.net/telusa/|title=The telusa list-archive by thread|website=www.bhaavana.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20211222185119/http://bhaavana.net/telusa/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: సంకా రామకృష్ణ <ref>{{Cite web|url=https://rksanka.tripod.com/|title=Telugu padyalu|website=rksanka.tripod.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20210309160451/https://rksanka.tripod.com/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.


== మూలాలు ==
== మూలాలు ==

02:16, 28 జనవరి 2022 నాటి కూర్పు

అంతర్జాలంలో తెలుగు చరిత్ర దాదాపు 1998 లో మొదలైంది. ఐ.ఆర్.సి చానెళ్ళలో చర్చలతో తెలుగు మొదలైంది. అది యాహూ గ్రూపులలో కొనసాగింది. అప్పట్లో తెలుగు భాషను రోమను లిపిలో రాసేవాళ్ళు. యూనికోడ్ తెలుగు ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అ తరువాత తెలుగు యాహూ గ్రూపులను గూగుల్ గ్రూపులను దాటి వెబ్‌సైట్లు, బ్లాగుల లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్తర్ వంటి వాటి లోకి విస్తరించింది.

2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్‌ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్ష్.పి వచ్చాక ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. కానీ చాలామంది విండోస్ 95, 98 లే వాడుతూ ఉండేవారు కాబట్టి ఈ సమస్య 2007-08 వరకూ ఉంటూనే ఉండేది. ఈ సమస్య తీరిపోవడం అనేది తెలుగు విస్తరణలో తొలి అడ్డంకి తొలగినట్లైంది.

కంప్యూటర్లో తెలుగులో రాయడం అనేది తరువాతి సమస్య. బహుశా తెలుగు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. తెలుగులో రాసేందుకు అవసరమైన పనిముట్లను అభివృద్ధి చేసి వెబ్ వ్యాప్తంగా అందుబాటు లోకి తేవడం మొదలయ్యాక ఈ సమస్యకు పరిష్కారం మొదలైంది. రైస్ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ అనేది తెలుగును తేలిగ్గా రాయగలిగే తొలి వ్యవస్థ. రోమను లిపిలో తెలుగును రాస్తే తెలుగు లిపి లోకి లిప్యంతరీకరణ చెయ్యదం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ పద్ధతినే వాడి మరింత తేలిగ్గా తెలుగులో రాయగలిగే లేఖిని వంటి ఉపకరణాలు రావడంతో తెలుగులో రాసే వీలు మరింత పెరిగింది. ఆ విధంగా తెలుగు విస్తరణ వేగం పుంజుకుంది.

చరిత్ర

ఫాంట్ల చరిత్ర

తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.[1]

మొదట్లో తెలుగు వెబ్‌సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే తొట్తతొలి ఫాంటు తిక్కన 1.1 యే. ఆ తరువాత దానికి మరిన్ని మార్పులు చేసి 1998 మార్చిలో తిక్కన 1.2 ను విడుదల చేసారు.

తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు

తెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ తెలుసా లిస్ట్ [2] ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: సంకా రామకృష్ణ [3] తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.

మూలాలు

  1. "తిక్కన ఫాంట్స్". www.ghantasala.info. Archived from the original on 2022-01-27. Retrieved 2022-01-27. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-02 suggested (help)
  2. "The telusa list-archive by thread". www.bhaavana.net. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-22 suggested (help)
  3. "Telugu padyalu". rksanka.tripod.com. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-03-09 suggested (help)