వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3,942 బైట్లు చేర్చారు ,  5 నెలల క్రితం
:తొలగింపును నివారించేందుకు కృషి ఏమీ చెయ్యలేదు. కనీసం, ప్రణయ్ రాజ్ గారు లేవనెత్తిన వాటిలో కొన్ని ఫైళ్ళనైనా పరిశీలిద్దామని అనుకోలేదు. ఇదిగో ఫలానా పదో ఇరవయ్యో ఫైళ్ళను చూసాను, నేను గమనించినది ఇది అని కూడా చెప్పలేదు. తొలగింపును నివారించే ప్రయత్నాలు అన్నీ చేసాక, తొలగింపు ఇంకా అవసరమైతేనే చెయ్యాలి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:51, 27 జనవరి 2022 (UTC)
::@[[వాడుకరి:Chaduvari|Chaduvari]] గారు, తాము చేసినపనిలో దోషాలను సవరించటానికి ఎక్కించినవారు చురుకుగా పనిచేయటానికి చొరవ తీసుకోనపుడు, కనీస స్పష్టమైన లింకులను కూడా ఇవ్వనపుడు, పనిచేయటానికి నాకు ఆసక్తి లేదు. ప్రణయ్ రాజ్ గారి తొలి వ్యాఖ్యకి స్పందన ఇవ్వడంజరిగినది. ఆంగ్లవికీలో తొలగింపులు అక్కడ పని చురుకుదనం బట్టి జరుగుతాయి. అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు. నేను పరిశీలించిన బొమ్మలలో కనీసం ఆంగ్ల వికీనుండి తీసుకొన్నానన్న వ్యాఖ్య కూడా చాలావరకు లేదు. మీరు ఈ బొమ్మల సముచిత వినియోగ వివరణలోని దోషాలను సరిదిద్దటానికి చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి. ధన్యవాదాలు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:55, 28 జనవరి 2022 (UTC)
:::@[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారూ,
:::
:::"అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు." అని రాసారు మీరు. సరే! అలాక్కానీండి.
:::
:::"మీరు చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి." అని కూడా రాసారు. మీరు చేస్తారా అని అడగడం వరకూ సరియే. కానీ, చెయ్యడానికి ఎంత సమయం కావాలో చెప్పమని ముందే అడగడం సరికాదు. కానీ ముందే ఎంత టైములో చేస్తావో చెప్పు అని షరతు విధించడం సబబు కాదు. ఎదటివాళ్ళను కించపరచేలా, చిన్నబుచ్చేలా, సూపర్వైజర్లాగా మాట్లాడ్డం ఎందుకు? మామూలుగా ఉండొచ్చుగా! బాటు రాయమంటే రాయలేనన్నారు. మరి, బాటు కోసం అభ్యర్థనైనా చెయ్యవచ్చుగా? మానవికంగా చేసే ఆసక్తి లేదు, బాటు కావాలని అడగరు, ఒక ఎడిటథాన్ లాంటి దాన్ని చేపట్టరు. తొలగింపు మాత్రమే చేస్తారు! తోటివారితో కలిసి పనిచేసే పద్ధతేనా ఇది, ఆలోచించండి.
:::
:::[[వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు]] పేజీలోని చర్చనే తీసుకోండి. అక్కడ మీరు రాసినది అనుచితంగా ఉందని ఇతరులు చెప్పాక కూడా దాన్ని సవరించలేదు. కనీసం మీ రాతలకు అభ్యంతరాలు వచ్చినపుడైనా మారాల్సింది. మారకపోగా అదే ధోరణిని కొనసాగించారు. చివరికి అక్కడి చర్చలో పాల్గొనని వారిని "..చాలామందికి కొత్త వ్యాసం సృష్టించడంపై ఎక్కువ ఆసక్తి వుండటం వలనో.. " అంటూ నర్మగర్భంగా మాట్టాడారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. ఇతరులు చెప్పినా కూడా మీరు మారడం లేదు. సముదాయంలో ఒకరుగా పనిచేస్తూ తోటి వాళ్ళను కించపరచడం, వాళ్ళ కృషిని కించపరచడం తగునా, ఆలోచించండి.
:::
:::అర్జున గారూ, దయచేసి మీ ప్రవర్తనను పరిశీలించుకోండి.
:::
:::ఇకపోతే, నేను ఈ పని చేసే సంగతి.. ముందు మీ గడువులూ, షరతులూ, సూపర్విజనూ పక్కన పెట్టండి. ఆసక్తి ఉన్నవారెవరో ఒకరు చెయ్యకపోరు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:59, 28 జనవరి 2022 (UTC)
 
== Feminism and Folklore 2022 ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3458041" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ