ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిత్రం చేర్చు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Newspaper
{{Infobox Newspaper
| name =ఆంధ్రప్రభ
| name =[[File:Andhraprabhalogo.gif |ఆంధ్రప్రభ]]
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px]]
| image = [[Image:Andhra Prabha daily.png|border|220px|2020-11-02 నాడు పేపర్ తొలిపేజీ]]
| caption =
| caption =
| type = ప్రతిదినం
| type = ప్రతిదినం

04:27, 5 ఫిబ్రవరి 2022 నాటి కూర్పు

ఆంధ్రప్రభ
2020-11-02 నాడు పేపర్ తొలిపేజీ
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ప్రచురణకర్తది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
స్థాపించినదిఆగస్టు 15, 1938; 85 సంవత్సరాల క్రితం (1938-08-15)
మద్రాసు,[1]
ముద్రణ నిలిపివేసినది1958-59
జాలస్థలిhttp://www.prabhanews.com/home

ఆంధ్రప్రభ ఒక తెలుగు దిన వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. నాస్తికుడైన నార్ల వెంకటేశ్వరరావు అనేక సంప్రదాయ విరుద్ధ పోకడలు ప్రవేశ పెట్టారనీ తదనంతర కాలంలో వచ్చిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యాజమాన్యం మారడానికి ముందు సంపాదకులుగా సుమారు దశాబ్దకాలం వి. వాసుదేవ దీక్షితులు సంపాదకుడుగా పనిచేశాడు. పొత్తూరి వేంకటేశ్వరరావు 1977 మే 5 న హైదరాబాదు సంచిక స్థానిక ముద్రణ ప్రారంభంపు తొలి స్థానిక సంపాదకుడుగా చేరి, 1980 వరకు పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఎడిటర్ గా పనిచేసి మరల 1983 లో మరల దినపత్రిక ఎడిటర్ పదవి చేపట్టి, 1991 జూన్ 6 న పదవీ విరమణ చేశాడు. [2]

మూలాలు

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు (2006). "మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 418–419.
  2. పొత్తూరి, వేంకటేశ్వరరావు (2015). విధి నా సారథి. ఎమెస్కో. pp. 167–168. ISBN 978-93-85231-06-3.

బయటి లింకులు