జాగర్లమూడి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:విద్యా సంస్థలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:ప్రకాశం జిల్లా ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 35: పంక్తి 35:


==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
[[వర్గం:ప్రకాశం జిల్లా]]
[[వర్గం:ప్రకాశం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]

08:39, 29 ఏప్రిల్ 2022 నాటి కూర్పు

జాగర్లమూడి చంద్రమౌళి
దస్త్రం:Sri. J.chandra mouli.jpg
రైతు నాయకుడు, విద్యాదాత
జననం1914 జులై 3
ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం
మరణం1987
ఇతర పేర్లుచంద్రమౌళి బాబు
విద్యన్యాయ శాస్త్ర పట్టబద్రుడు B.A., B.L.
పదవీ కాలంశాసన సభ్యులు - 1955 - 62

రాజ్య సభ సభ్యులు - 1968 -74

శాసన సభ్యులు - 1978 - 83
రాజకీయ పార్టీస్వతంత్ర పార్టీ, జనతా పార్టీ
మతంహిందువు
భార్య / భర్తగంగా భవాని
పిల్లలునలుగురు కుమారులు, ఒక కుమార్తె
తల్లిదండ్రులుజాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ

జాగర్లమూడి చంద్రమౌళి (1914 - 1987) ఒక భారత రాజకీయ నాయకుడు. రాజ్యసభ, శాసన సభలలో సభ్యునిగా రైతు నాయకుడుగా, విద్యాదాతగా పేరు గడించారు.

జననం, విద్య

జాగర్లమూడి చంద్రమౌళి బాబు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆదిలక్ష్మీ దంపతులకు 1914 జులై 3న జన్మించాడు. మహాదాత, గొప్ప విద్యాపోషకుడు.నిష్కలంక రాజకీయ సంఘ సేవకుడు అయిన తండ్రి గారి అడుగుజాడలలో పయనించి ఇతడు కూడా మంచి ప్రజాసేవకుడిగా,విద్యాదాతగా పేరు గడించాడు.

చంద్రమౌళి బాబు గారు న్యాయ శాస్త్ర పట్టబద్రుడు ( B.A., B.L.). భారత్ సమాజ్ లో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేసారు[1].

రాజకీయ ప్రస్థానం

చంద్రమౌళి బాబు గారు 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో అమ్మనబ్రోలు నుండి ఐక్య కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచాడు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యుడయ్యాడు. గుంటూరు జిల్లా అర్బన్ బ్యాంకు అధ్యుక్షులుగా, జిల్లా మర్కెటింగ్ పెడరేషన్ అధ్యుక్షులుగా సహకార రంగంలో విశేష కృషి చేసారు.

రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి. రంగా గారితో కలసి స్వతంత్ర పార్టీ చేరారు. స్వతంత్ర పార్టీ ఉపాద్యుక్షునిగా పార్టీ అభివృద్దికి కృషి చేసారు.1962 లో జరిగిన పిరంగపురము నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి పై పరజయం చెందాడు.

1968లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఏన్నికైనాడు.(1968 - 1974) రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసారు.

1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర స్థితి తరువాత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి మార్గదర్శకత్వంలో విపక్ష పార్టీలన్నీ విలీనం అయి జనతా పార్టీగా అవతరించింది. చంద్రమౌళి బాబు గారు కూడా జనతా పార్టీ లో చేరారు.

1978లో మార్టూరు నుండి జనతా పార్టీ శాసన సభ్యుడిగా(1978 - 1983) ఏన్నికైనారు[1].

విద్యా దాత

చంద్రమౌళి బాబు గారు తన తండ్రి జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి అడుగుజాడలలో పయనించి నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి,తన తండ్రి పేరుతో గుంటూరు నగరంలో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల 1967లో స్థాపించారు. ఈ విద్యాసంస్థ అద్వర్యంలో ఇప్ప్పుదు ఎనిమిది ప్రముఖ విద్యాలయాలు విద్యను అందిస్తున్నాయి[1].

కుటుంబం

చంద్రమౌళి బాబు గారి మొదటి భార్య ఇందిరా దేవి. వీరికి సంతానం కలుగలేదు. వీరి రెండవ భార్య గంగా భవాని. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. చంద్రమౌళి బాబు గారు 1987 లో పరమపదించారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి వెంకట నారాయణ. p. 238.
  2. "RVR & JC College of Engineering".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "JC College of Law".{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లంకెలు