ఆంధ్ర వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:


'''ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి''' మహారాజా శ్రీ [[జి.ఎన్.గణపతిరావు]] గారు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రభుత్వం స్వీకరించి నడుపుతున్నది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉన్నది.
'''ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి''' మహారాజా శ్రీ [[జి.ఎన్.గణపతిరావు]] గారు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రభుత్వం స్వీకరించి నడుపుతున్నది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉన్నది.

==పూర్వ విద్యార్ధుల సంఘం==
'''ఆంధ్ర వైద్య కళాశాల పుర్వ విద్యార్ధుల సంఘం''' (Andhra Medical College Old Students' Association:AMCOSA) [[1967]] సంవత్సరంలో డా. బ్రహ్మయ్యశాస్త్రి మరియు డా. వ్యాఘ్రేశ్వరుడు కృషి ఫలితంగా స్థాపించబడినది.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

08:06, 29 డిసెంబరు 2008 నాటి కూర్పు

ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము విశాఖపట్టణం నగరములొ 1902 సంవత్సరములొ స్థాపించబడి కోస్తా జిల్లాలకు వైద్యసేవలు అందించడానికి వైద్యులను తయారు చేస్తున్న విద్యాసంస్థ.

చరిత్ర

విశాఖపట్నంలో వైద్య విద్య క్రితం శతాబ్ద ప్రారంభంలో 1902 సంవత్సరం విక్టోరియా డైమండ్ జూబ్లీ వైద్య పాఠశాలగా ప్రారంభించబడినది. పాత పోస్టాఫీసు దగ్గర దీని స్థాపనకు మహారాజా గోడే నారాయణ గజపతిరావు మరియు మహారాణి చిట్టిజానకియమ్మ సహాయం చేశారు. కొంత కాలం తరువాత వైద్య పాఠశాల ప్రస్తుత శరీరధర్మశాస్త్ర విభాగానికి తరళించబడినది. మొదటి బాచ్ లో 50 మంది విద్యార్ధులతో ప్రారంభమైన ఈ కోర్సును లైసెన్సియేట్ సర్టిఫికేట్ స్టాండర్డ్ A అని పిలిచేవారు.

పాఠశాల భవనము వైజాగపట్నం వైద్య కళాశాలగా 1 జూలై, 1923 లో 32 విద్యార్ధులతో ప్రారంభమైనది. అయితే కాలేజీ పనిచేయడం మాత్రం 7 జూలై, 1923లో కెప్టెన్ ఫ్రెడరిక్ జాస్పర్ ఆండర్సన్ ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రారంభమైనా వైద్య కళాశాల మాత్రం 19 జూలై, 1923 తేదీన గౌరవనీయులైన దివాన్ బహదూర్ పానగల్ రాజా పానుగంటి రామరాయ అయ్యంగర్ చే ప్రారంభించబడినది.

కళాశాల గ్రంథాలయము

ఆంధ్ర వైద్య కళాశాల కేంద్ర గ్రంథాలయము 1930 లో స్థాపించబడినది. 1987 సంవత్సరానికి ఇక్కడ సుమారు 32,000 పుస్తకాలు మరియు 107 పత్రికలు సేకరించబడినవి. ఈ మధ్యకాలంలో గ్రంథాలయం పానగల్ భవంతి దగ్గరలోని నూతన భవంతిలోకి తరళించబడినది.

అనుబంధంగా ఉన్న వైద్యశాలలు

కింగ్ జార్జి ఆసుపత్రి గౌరవనీయులైన పానగల్ రాజా, మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 జూలై, 1923 లో ప్రారంభించారు. అప్పటి 192 పడకల సామర్ధ్యాన్ని 1931-32 కల్లా 270 కి పెంచారు. స్త్రీల మరియు గర్భిణీ స్త్రీల విభాగం 1928లో 40 పడకలతో నిర్మించబడినది. నేత్ర చికిత్సా విభాగం 1932లో 80 పడకలతో నిర్మించారు. ఓ.పి.విభాగము మరియు అత్యవసర సర్వీసుల కోసం ప్రత్యేక భవనం 1940లో నిర్మించారు. దానికి దగ్గరలోనే 36 పడకలతో చిన్న పిల్లల విభాగం 1943 లో నిర్మించి తరువాత కాలంలో దానిని స్త్రీల విభాగంతో విలీనం చేశారు. పరిపాలనా విభాగం మరియు జంట శస్త్రచికిత్స థియేటర్లు 1951లో నిర్మించారు.

ఆసుపత్రిని విస్తృత పరచి స్వాతంత్ర్యానంతరం మద్రాసు గవర్నరు పేరు మీద భావనగర్ వార్డు 1949లో నిర్మించారు. భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1955లో రాజేంద్ర ప్రసాద్ వార్డు 1955లోను తరువాత ఆరోగ్య శాఖామాత్యులైన రాజకుమారి అమ్రిత్ కౌర్ 1956లో పిల్లల వార్డు ప్రారంభించారు. గుండె చికిత్స కోసం ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ 1986 లో తరువాత హృద్రోగ శస్త్రచికిత్స విభాగం చేర్చబడినవి. ప్రయోగశాలల కోసం ప్రత్యేక విభాగం 1992లో నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే మొట్టమొదటిగా న్యూక్లియర్ వైద్యచికిత్స విభాగం 8 అక్టోబర్, 1993 లో ప్రారంభించారు.


ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి మహారాజా శ్రీ జి.ఎన్.గణపతిరావు గారు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రభుత్వం స్వీకరించి నడుపుతున్నది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉన్నది.

పూర్వ విద్యార్ధుల సంఘం

ఆంధ్ర వైద్య కళాశాల పుర్వ విద్యార్ధుల సంఘం (Andhra Medical College Old Students' Association:AMCOSA) 1967 సంవత్సరంలో డా. బ్రహ్మయ్యశాస్త్రి మరియు డా. వ్యాఘ్రేశ్వరుడు కృషి ఫలితంగా స్థాపించబడినది.

బయటి లింకులు