Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 32: పంక్తి 32:
సిరిసిల్ల పట్టణముకీ అనుకోని మానేరుడ్యామ్ ఉండడం వలన నీటికి కొరతలేకుండా ఉన్నది.బోరు బావులద్వారా కూడా నీరు అంతుంది.
సిరిసిల్ల పట్టణముకీ అనుకోని మానేరుడ్యామ్ ఉండడం వలన నీటికి కొరతలేకుండా ఉన్నది.బోరు బావులద్వారా కూడా నీరు అంతుంది.
==రవాణా వ్యవస్థ==
==రవాణా వ్యవస్థ==
వేములవాడ వెళ్లే మార్గంలో ఉండడంతో24 గంటల బస్సు సదుపాయం ఆటోల సదుపాయం కూడా ఉన్నది. రాష్ట్ర రహదారి సిరిసిల్ల పట్టణం గుండా వెళుతుంది
వేములవాడ వెళ్లే మార్గంలో ఉండడంతో24 గంటల బస్సు సదుపాయం ఆటోల సదుపాయం కూడా ఉన్నది. రాష్ట్ర రహదారి సిరిసిల్ల పట్టణం గుండా వెళుతుంది.


==గణాంకాలు ==
==గణాంకాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

== విద్య ==
ఈ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. [[జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం|జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ]] పరిధిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. 2021లో మహిళల కోసం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించబడింది. ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది, ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాకుండా పట్టణంలో అనేక ప్రైవేట్ డిగ్రీ, సాంకేతిక సంస్థలు ఉన్నాయి.


== విశేషాలు ==
== విశేషాలు ==

09:23, 30 అక్టోబరు 2022 నాటి కూర్పు

  ?సిరిసిల్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.68 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) రాజన్న సిరిసిల్ల జిల్లా
జనాభా
జనసాంద్రత
83,186[2] (2011 నాటికి)
• 3,239/కి.మీ² (8,389/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిరిసిల్ల పురపాలకసంఘం


సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో సిరిసిల్ల పురపాలకసంఘం గా ఏర్పడింది.[3] ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్స్‌టైల్ టౌన్ అని కూడా పిలుస్తారు. 40,000 పవర్ లూమ్‌లతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్ గా ఉంది.[4] విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది.

భౌగోళికం

ఈపట్టణం 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[5] దీని సగటు ఎత్తు 322 మీటర్లు (1056 అడుగులు). దీనికి ఉత్తరాన 130 కి.మీ.ల దూరంలో సికింద్రాబాద్, పశ్చిమాన 40 కి.మీ.ల దూరంలో కరీంనగర్, ఉత్తరాన 35 కి.మీ.ల దూరంలో సిద్దిపేట, తూర్పున 56 కి.మీ.ల దూరంలో కామారెడ్డి ఉన్నాయి. ఇక్కడికి 10 కి.మీ.ల దూరంలో చారిత్రాత్మకమైన వేములవాడ ఆలయ పట్టణం ఉంది.

విద్యుత్ సరఫరా

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.[3]

నీటి వసతి

సిరిసిల్ల పట్టణముకీ అనుకోని మానేరుడ్యామ్ ఉండడం వలన నీటికి కొరతలేకుండా ఉన్నది.బోరు బావులద్వారా కూడా నీరు అంతుంది.

రవాణా వ్యవస్థ

వేములవాడ వెళ్లే మార్గంలో ఉండడంతో24 గంటల బస్సు సదుపాయం ఆటోల సదుపాయం కూడా ఉన్నది. రాష్ట్ర రహదారి సిరిసిల్ల పట్టణం గుండా వెళుతుంది.

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

విద్య

ఈ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. 2021లో మహిళల కోసం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించబడింది. ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది, ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాకుండా పట్టణంలో అనేక ప్రైవేట్ డిగ్రీ, సాంకేతిక సంస్థలు ఉన్నాయి.

విశేషాలు

  • సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
  • డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
  • వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
  • 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[3]
  • ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన రాజన్న సిరిపట్టు, సిరిచందన పట్టు చీరలు ఈ సిరిసిల్ల పట్టణంలోనే తయారవుతున్నాయి.[6][7]

విగ్రహాలు

ఇక్కడి మానేరు న‌ది స‌మీపంలోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద కొత్త‌గా ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని 2022 సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుమార్, నాఫ్కెబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.[8][9]

ప్రముఖులు

మూలాలు

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  3. 3.0 3.1 3.2 "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Archived from the original on 4 మార్చి 2021. Retrieved 5 May 2021.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-05. Retrieved 2021-05-05.
  5. Falling Rain Genomics, Inc – Siricilla[permanent dead link]
  6. "Rajanna Siripattu sarees weave magic in New Zealand". The New Indian Express. 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-10-14.
  7. "'సిరిచందన' సౌగంధం". EENADU. 2022-10-09. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.
  8. "తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్‌ బాపూజీ". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
  9. telugu, NT News (2022-09-27). "కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పోరాటం మ‌రువ‌లేనిది : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.

వెలుపలి లింకులు

[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.

ఇవి కూడా చూడండి