అనూరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

14:06, 11 సెప్టెంబరు 2006 నాటి కూర్పు

ఊరువులు అంటే తొడలు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. వారి తల్లి వినతకు నెలలు నిండాక బిడ్డలకు బదులుగా రెండు గుడ్లు పుట్టాయి. అవి ఎంతకాలానికీ పొదగకపోవడంతో ఆమె ఒక గుడ్డును పగలగొట్టింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని శిశువు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు గుడ్డు పగలగానే తన తల్లితో మాట్లాడుతూ ఆమె తొందరపాటును తెలియజేసి, "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అనూరుడు&oldid=37644" నుండి వెలికితీశారు