శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణకు అనుకూలంగా శీర్షికలు
పంక్తి 4: పంక్తి 4:
==నిర్మాణ సంప్రదాయాలు==
==నిర్మాణ సంప్రదాయాలు==


సాధారణంగా హిందూ [[దేవాలయం|దేవాలయాల]] నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.


శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, [[గర్భగుడి]]లో శివలింగం ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.


ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.


==పరివార దేవతలు==
==పరివార దేవతలు==

12:06, 22 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


నిర్మాణ సంప్రదాయాలు

సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.


శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగం ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.


ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.

పరివార దేవతలు

సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.


చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.


అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.


అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు

విశేషాలు

కొన్ని ప్రముఖ శివాలయాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=శివాలయం&oldid=387528" నుండి వెలికితీశారు