"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5,172 bytes added ,  11 సంవత్సరాల క్రితం
విస్తరణ జరుగుతున్నది
(విస్తరణ జరుగుతున్నది)
(విస్తరణ జరుగుతున్నది)
* శంఖవరం పాణిని
 
==శీర్షికలు, రచనలు==
 
ఈ మాట పత్రిక అమరికలో కంప్యూటర్ అందించే సౌకర్యాలు పాఠకులకు బాగా ఉపయోగపడుతాయి. వ్యాసాలు, పాత వ్యాసాలు, అభిప్రాయాలు వంటి వాటికి పూర్తి ఆస్కారం ఉంది.
 
ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం
 
 
 
రచయితలకు సూచనలలో తెలిపిన కొన్ని విషయాలు : ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
 
 
 
ఈమాటలో ప్రచురింపబడే రచనలకు "సహరచయితల సమీక్ష" అనే పద్ధతి అమలులో ఉంది. దానిని సంపాదక వర్గం ఇలా వివరించారు -
:మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. సంపాదకులు, సమీక్షకులు రచనకు సూచించిన మార్పులు, చేర్పులు రచయితలు చేసిన తరువాత రచనలను ప్రచురణకు తగిన విధంగా పరిష్కరించి ప్రచురిస్తాము. ఈమాట స్థాయికి తగినట్లు రచనలకు చిన్న చిన్న మార్పులు చేసే అధికారం సంపాదకులకు ఉంటుంది. ఒకవేళ రచయితలకి మార్పులు నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేము తిరస్కరించడమో జరుగుతుంది. - ఈ రివ్యూ పద్ధతి తెలుగు రచయితలకు కొత్త. వారి రచనకు తగిన గౌరవం ఇస్తారో లేదో అనే భయమో, సంపాదకుల, సమీక్షకుల విద్వత్తూ, అర్హతల మీద అపనమ్మకమో ఇతరత్రా మరే కారణాల వల్లనో రచయితలలో జంకు కలగడం సహజం. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన తరువాత రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ఈమాటలో ప్రచురిస్తాం. ఈ ప్రివ్యూ పద్ధతి ఈమాటకు ప్రత్యేకం.
 
ఈ సమీక్షా విధానంపై ఆసక్తికరమైన అనేక చర్చలు కూడా జరిగఅయి.
 
 
 
 
==పాఠకుల అభిప్రాయాలు==
* విష్ణుభొట్ల లక్ష్మన్న (మే 2, 2006) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిధ్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు: (1) ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం. (2) ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది. (3) ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది.
** ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం.
** ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది.
** ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది.
ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/397928" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ