వాడుకరి చర్చ:కాసుబాబు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
6,010 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
వివరణలకు విన్నపం
(వివరణలకు విన్నపం)
క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు
------------------------------
 
కాసుబాబుగారూ, నమస్తే. నేను వైజా సత్యగారి చర్చా పుటలో వివరణలు కోరిన విషయాలు,మీకు కూడ తెలియచేయటానికి ఇక్కడ కూడ కాపీ చేస్తున్నాను. దయచేసి, నాకు తెలుపగలరు.
==వివరణల అవసరం==
వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.
#ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
#వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
#నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
#ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
#విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
#చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.
 
నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.
 
ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 03:10, 26 ఏప్రిల్ 2009 (UTC)
==గరికపాడు==
కాసు బాబు గారు, మీరు ప్రస్తవించిన అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గరికపాడు అగ్రహారానికి [[గరికపాడు (క్రోసూరు మండలం)]] చెందినవారు, గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గరికపాటి వంశచరిత్ర పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను.
3,487

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/404806" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ