డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అ…
(తేడా లేదు)

19:08, 26 మే 2009 నాటి కూర్పు

మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ 2004లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ 2009లో రెండో సారి విజయం సాధించి ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా నియమించబడింది.