పూస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: cs, de, eo, es, he, ja, ko, nl, pt, ru
పంక్తి 25: పంక్తి 25:


[[en:Bead]]
[[en:Bead]]
[[cs:Korálek]]
[[de:Künstliche Perle]]
[[eo:Artefarita perlo]]
[[es:Abalorio]]
[[he:חרוז (חפץ)]]
[[ja:ビーズ]]
[[ko:비즈]]
[[nl:Kraal (versiering)]]
[[pt:Miçanga]]
[[ru:Бисер]]

19:14, 7 జూలై 2009 నాటి కూర్పు

పుసలు
దస్త్రం:Colourful green market.jpg
బజారులో అమ్మకానికున్న పూసలు

పూసలు (Beads) అలంకరణలో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. హారంగా తయారుచేయడం కోసం దారం ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని రంధ్రం ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.

పూసల్ని గిరిజనుల నుండీ ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, దుస్తులు, పాదరక్షలు, పరదాలలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. అబాకస్ లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.


పుసలు ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్ళుతో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, కర్పరాలు, విత్తనాలు మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన రుద్రాక్షలు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.

పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.

వింటేజ్ పూసలు

వింటేజ్ ("Vintage") పూసలు సంగ్రహకులకు ప్రత్యేక ఆకర్షణ. ఏ రకమైన పూసలైనా 25 సంవత్సరాల కంటే పురాతనమైతే వాటిని వింటేజ్ పూసలుగా పరిగణిస్తారు. ఇవి ఎక్కువగా ప్లాస్టిక్, స్ఫటికాలు మరియు గాజుతో తయారైవుంటాయి.


సాంప్రదాయక పూసలు

చెక్కబడిన సినబార్ లక్క పూసలు

పశ్చిమ ఆఫ్రికాలో కిఫ్ఫా పూసలు, గాజు పొడి పూసలు లాంటివి సాంప్రదాయకమైనవి. టిబెటన్లు కంచూ పూసలు ఉపయోగిస్తారు. భారతదేశంలోని రుద్రాక్ష పుసలు (Rudraksha beads) కూడా ఒక ఉదాహరణ. వీటిని బౌద్ధులు మరియు హిందువులు జపమాలగా ఉపయోగిస్తారు. మగతమ పూసలు సాంప్రదాయక జపనీస్ పూసలైతే సినబార్ లక్కతో చేసిన పుసలు చైనాలో ఉపయోగిస్తారు. కొన్ని రకాల జీవుల కర్పరాలతో చేసిన పూసలు ఉత్తర అమెరికా తెగలవారు ఉపయోగిస్తారు.[1]

మూలాలు

  1. Dubin, Lois Sherr. North American Indian Jewelry and Adornment: From Prehistory to the Present. New York: Harry N. Abrams, 1999: 170-171. ISBN 0-8109-3689-5.
"https://te.wikipedia.org/w/index.php?title=పూస&oldid=437711" నుండి వెలికితీశారు