"కొమ్మినేని శేషగిరిరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''కొమ్మినేని శేషగిరిరావు''' (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.
 
ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు [[కె.చక్రవర్తి]]కి సోదరుడు. వీరి స్వస్థలం [[గుంటూరు జిల్లా]] స్వగ్రామం [[తెనాలి]] సమీపంలోని [[పొన్నెకల్లు]]. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, [[గొప్పవారి గోత్రాలు]] (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, తాతామనవడు, సంసారం సాగరం వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు.
 
తరువాతదర్శకునిగా ఆయనకొమ్మినేని తొలిచిత్రం [[గిరిబాబు]] హీరోగా నటించిన [[దేవతలారా దీవించండి]] చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్ర విజయం తరువాత [[సింహగర్జన]] సినిమాకు, ఆ తరువాత [[తాయారమ్మ బంగారయ్య]] సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో [[శివాజీ గణేశన్‌]]తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. వీరు [[కన్నడం]]లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.
 
కొమ్మినేని 2008, డిసెంబర్ 5న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
 
[[వర్గం:2008 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం: గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/437855" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ