కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా[[ ప్రార్ధన]] చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైన[[ గతి]] భేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి.

==జడ కోలాటం==
==జడ కోలాటం==
కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమ సంఖ్యలో తాళ్ళు పట్టుకుని గుండ్రంగా నిలిచి రెండు పక్షాలుగా చీలుతారు. [[లయ]] ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలో తిరగడంతో ఈ తాళ్ళన్నీ అల్లబడిన [[జడ]]లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా ఎదురు తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం.

==బయటి లింకులు==
==బయటి లింకులు==

12:54, 13 జూలై 2009 నాటి కూర్పు

కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.

విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు.

దండియా

దసరా నవరాత్రుల సంబరాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన దండియా కూడా కోలాటం వలెనే రంగురంగుల కర్రలతో రాధాకృష్ణుల గీతాలతో నృత్యం చేస్తారు.

ఆట విధానం

కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతాప్రార్ధన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైనగతి భేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి.

జడ కోలాటం

కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమ సంఖ్యలో తాళ్ళు పట్టుకుని గుండ్రంగా నిలిచి రెండు పక్షాలుగా చీలుతారు. లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలో తిరగడంతో ఈ తాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా ఎదురు తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కోలాటం&oldid=439643" నుండి వెలికితీశారు