కందం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
==లక్షణములు== |
==లక్షణములు== |
||
>open |
|||
>ఒపెన్ |
|||
క. |
క. |
||
కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్ |
'''కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్ |
||
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్. |
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.''' |
||
</open |
|||
</ఒపెన్ |
|||
*పాదాలు: 4 |
*పాదాలు: 4 |
||
*కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. '''గగ''', '''భ''', '''జ''', '''స''', '''నల''' ఇవీ ఆ గణాలు |
*కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. '''గగ''', '''భ''', '''జ''', '''స''', '''నల''' ఇవీ ఆ గణాలు |
17:24, 14 జూలై 2009 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
ఉదాహరణ 1
- నడువకుమీ తెరువొక్కట
- గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
- ముడువకుమీ పరధనముల
- నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
లక్షణములు
>open క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్ బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్. </open
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
- యతి
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
పై పద్యానికి గణములు లెక్కిస్తే
గగ గణము గగ గణము జ గణము నల గణము స గణము
గగ గణము స గణము నల గణము స గణము గగ గణము
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
గగ గణము = UU { గురువు, గురువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}