రవళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>
2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>


==ఇతర విశేషాలు==
రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>
* రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>


==మూలాలు==
==మూలాలు==

11:44, 16 జూలై 2009 నాటి కూర్పు

రవళి (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు

తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న మరియు కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ ఒకటి.[2] 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[3] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[4] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[5][6]

ఇతర విశేషాలు

  • రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.[7]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=440646" నుండి వెలికితీశారు