వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
పంక్తి 15: పంక్తి 15:
[[వర్గం:కడప జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కడప జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]
pedaapapasupula venkateswara reddy

10:37, 5 ఆగస్టు 2009 నాటి కూర్పు

వెల్లాల కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం మండలంలో ఉంది. కుందూ నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా చాగలమర్రి వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., జమ్మలమడుగు నుంచి 23 కి.మీ.

వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.

సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.

గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేశారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ప్రముఖ చలనచిత్ర నటి శాంతకుమారిది వెల్లాల గ్రామమే.

ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఇక్కడ నిర్మించిన వైద్యశాలలో పేదలకు ఉచిత వైద్యమందుతోంది.

మూలాలు, వనరులు

కడప జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు

pedaapapasupula venkateswara reddy

"https://te.wikipedia.org/w/index.php?title=వెల్లాల&oldid=445055" నుండి వెలికితీశారు