ప్రదక్షిణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
==ఇస్లాంలో ప్రదక్షిణాలు== *హజ్ యాత్రికులు కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు (తవాఫ్ ) చ
పంక్తి 15: పంక్తి 15:
==ఇస్లాంలో ప్రదక్షిణాలు==
==ఇస్లాంలో ప్రదక్షిణాలు==
*[[హజ్ ]] యాత్రికులు [[కాబా]] చుట్టూ ఏడు సార్లు [[ప్రదక్షిణాలు]] ([[తవాఫ్]] ) చేస్తారు.
*[[హజ్ ]] యాత్రికులు [[కాబా]] చుట్టూ ఏడు సార్లు [[ప్రదక్షిణాలు]] ([[తవాఫ్]] ) చేస్తారు.
==మూలాలు==

{{మూలాలజాబితా}}
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]

13:03, 6 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

ప్రదక్షిణము అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.

ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు బలిపీఠం (ధ్వజస్తంభం) వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయం లో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. [1]

దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రదమని చెప్పబడినది.

శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.

ప్రదక్షిణంలో రకాలు

  • ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
  • పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
  • అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.
  • గిరి ప్రదక్షిణము : దేవుడు కొలువుండే కొండ చుట్టు చేసే ప్రదక్షిణం.

ఇస్లాంలో ప్రదక్షిణాలు

మూలాలు

  1. సెప్టెంబర్ 6, ఆదివారం 2009 ఈనాడు దినపత్రిక సామవేదం షణ్ముఖ శర్మ రాసిన అంతర్యామిలో రాసిన ప్రదక్షిణలో పరమార్థం అనే శీర్షిక ఆధారంగా...