స్థానం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:


వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు.
వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు.

ఆయన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని రచించారు.


స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.
స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.

09:30, 11 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

స్థానం నరసింహారావు (ఆంగ్లం: Sthanam Narasimha Rao) (1902 - 1971) ప్రసిద్ధ రంగస్థల మరియు తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.

జీవిత విశేషాలు

స్థానం నరసింహారావు 1902 సంవత్సరం సెప్టెంబర్ 23 తేదీన గుంటూరు జిల్లా బాపట్ల లో హనుమంతరావు మరియు ఆదెమ్మ దంపతులకు జన్మించాడు.

1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్ర నాటకం లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించారు. తెనాలి లోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించారు.

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవారు.

వీరు సినీ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు.

ఆయన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని రచించారు.

స్థానం 1971 ఫిబ్రవరి 21 తేదీన మరణించాడు.

ఇతర విశేషాలు

  • 1956 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు మరియు కళాకారుడు.
  • ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం ఇవ్వబడినది.
  • వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
  • వీరి షష్టిపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాదులో నిర్వహించారు.

మూలాలు

  • నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002, పేజీలు 20-23.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

బయటి లింకులు