"ఎస్.పి.కోదండపాణి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి.మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.
 
హాస్యనటులు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు.
 
[[పద్మనాభం]] గారి [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశారు.
 
==చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/455060" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ