స్నానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: zh:沐浴
చి యంత్రము కలుపుతున్నది: ms:Mandi
పంక్తి 40: పంక్తి 40:
[[id:Mandi]]
[[id:Mandi]]
[[ja:入浴]]
[[ja:入浴]]
[[ms:Mandi]]
[[pt:Banho (higiene corporal)]]
[[pt:Banho (higiene corporal)]]
[[ru:Ванны (медицинские)]]
[[ru:Ванны (медицинские)]]

10:22, 25 నవంబరు 2009 నాటి కూర్పు


లోహపు స్నానపు తొట్టెలో స్నానం చేస్తున్న పిల్లలు

శరీరాన్ని ఒక ద్రవము, సాధారణముగా నీళ్ళతో తడిపి లేదా నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని స్నానం అంటారు. స్నానానికి పాలు, నూనె, తేనె వంటి ద్రవపదార్ధాలను ఉపయోగించినా నీటినే ప్రధానముగా వాడతారు. తరచూ క్రమంతప్పకుండా స్నానం చేయటం శారీరక శుభ్రతలో భాగంగా నిర్వహిస్తారు.

కొన్ని స్పాలలో, ఆయుర్వేద శాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్ధాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. షాంపేనుతో స్నానం చేసిన ఉదహారణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతే కాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు. ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

పురాణాలలో స్నానం

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం".
ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం"
వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"
దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".
మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం.మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది.ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=స్నానం&oldid=470725" నుండి వెలికితీశారు