రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
41 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
యంత్రము మార్పులు చేస్తున్నది: ko:면역계통; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: fj:Sotia ni Yago)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:면역계통; cosmetic changes)
[[Imageదస్త్రం:Neutrophil with anthrax copy.jpg|thumb|right|250px|A [[scanning electron microscope]] image of a single [[neutrophil]] (yellow), engulfing [[anthrax]] bacteria (orange).]]
 
'''రోగ నిరోధ వ్యవస్థ''' (Immune system or Immunity) జీవుల శరీరానికి [[రక్షణ వ్యవస్థ]] (Defence system). దీనిని '''అసంక్రామ్య వ్యవస్థ''' అని కూడా పిలుస్తారు. దీనిలో [[తెల్ల రక్తకణాలు]] (White Blood Cells), [[ప్రతిదేహాలు]] (Antibodies) మరియు కొన్ని చిన్న [[అవయవాలు]] (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
 
== అసంక్రామ్యత రకాలు ==
'''అసంక్రామ్యత''' రెండు రకాలు:
=== స్వాభావిక అసంక్రామ్యత ===
'''స్వాభావిక అసంక్రామ్యత''' (Innate immune system) : పుట్టుకతో వచ్చే అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. దీనిలో కొన్ని రకాల అవరోధాలు పుట్టుకతోనే వస్తాయి. అవి.
* అంతర్నిర్మాణపర అవరోధాలు: ఉదాహరణ: [[చర్మం]], [[లాలాజలం]], [[కన్నీరు]], శ్లేష్మస్రావాలు.
* శరీరధర్మపర అవరోధాలు: ఉదాహరణ: కన్నీటిలోని లైసోజైమ్, ఇంటర్ ఫెరాన్లు, పరిపూరక ప్రోటీన్లు, దేహ ఉష్ణోగ్రత
* భక్షకకణ అవరోధాలు:
* ఉజ్వలనపర అవరోధాలు: ఉజ్వల అనుక్రియలు (Inflammatory response) అయిన రూబర్, ట్యూమర్, కేలర్, డోలర్ అనేవి.
 
=== ఆర్జిత అసంక్రామ్యత ===
'''అనుకూలన అసంక్రామ్యత''' (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు. దీని ముఖ్య లక్షనాలు నిర్దిష్టత, వైవిధ్యం, జ్ఞప్తి.
* '''క్రియాశీల అసంక్రామ్యత''': ఒక జీవిలో ప్రతిజనకాలు ప్రవేశించడం వల్ల ప్రతిదేహాలు ఏర్పడి అసంక్రామ్యత కలిగితే అది క్రియాశీల అసంక్రామ్యత అవుతుంది.
* '''స్తబ్దతా అసంక్రామ్యత''': ఒక జీవిలో ఏర్పడిన ప్రతిదేహాలను మరో జీవిలోకి ప్రవేశపెట్టబడడం వల్ల ఆ జీవిలో కలిగేది స్తబ్దతా అసంక్రామ్యత.
 
== అవయవాలు ==
* '''ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు''' (Primary Lymphoid Organs): ఏ అవయవాలలోనైతే కణాలు అసంక్రామ్యతా అర్హత కణాలుగా యోగ్యతను పొందుతాయో వాటిని ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటారు. ఉదా: ఎముక [[మూలుగ]] లేదా మజ్జ, [[థైమస్ గ్రంథి]], పక్షుల్లో [[బర్సా ఫాబ్రికస్]]
* '''ద్వితీత లింఫాయిడ్ అవయవాలు''' (Secondary Lymphoid Organs): ఈ అవయవాలలో అసంక్రామ్యతా అర్హత కణాలు క్రియాత్మక కణాలుగా మారతాయి. ఉదా: [[ప్లీహం]], [[శోషరస గ్రంధులు]], శ్లేష్మానుబంధ శోషరస కణజాలం (MALT)
 
== కణాలు ==
అసంక్రామ్యతలో వివిధ రకాల కణాలు పాల్గొంటాయి. వీనిలో శోషరస, భక్షక, ఉపక్రియా కణాలు ముఖ్యమైనవి.
=== శోషరస కణాలు ===
* '''B కణాలు''' ('''B cells'''): ఇవి ప్రతిదేహాలను తయారుచేసే [[కణాలు]]. ఇవి ఎముక మూలుగలో అసంక్రామ్యతా కణాలుగా మారతాయి. పక్షుల్లో బర్సా ఫాబ్రికస్ లో ఏర్పడతాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో క్రియాత్మక జ్ఞప్తి కణాలు, ప్లాస్మా కణాలుగా మారతాయి. ఈ B కణాల ఉపరితలంపై B కణ గ్రాహకాలు (B Cell Receptors) ఉంటాయి. ఇవి ప్రతిజనకం లేదా T కణాలతో సంధితమై వాటిని ప్రేరేపిస్తాయి.
* '''T కణాలు''' ('''T cells'''): ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఇవి థైమస్ గ్రంథిలో అసంక్రామ్యతా అర్హత కణాలుగా మారతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో T<sub>H</sub>, T<sub>C</sub> కణాలు, జ్ఞప్తి కణాలు (Memory cells) గా మారతాయి.
 
=== ఏకకేంద్రక భక్షక కణాలు ===
* మోనోసైట్లు (Monocytes) మరియు స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు మరియు కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి [[ఏక కేంద్రక భక్షక వ్యవస్థ]] (Mononuclear Phagocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు (Histiocytes), ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు (Alveolar Macrophages), కాలేయంలో కుఫర్ కణాలు (Kupfer cells), మెదడులో మైక్రోగ్లియల్ కణాలు (Microglial cells) గా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు [[ప్రతిజనక సమర్పిత కణాలు]] (Antigen Presenting Cells) గా పనిచేస్తాయి.
 
== మూలాలు ==
* జీవుల్లో రక్షణ వ్యవస్థ, ఎం.బి.తిలక్ [[ఈనాడు]] ఏప్రిల్ 3, 2009 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం.
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
[[it:Sistema immunitario]]
[[ja:免疫系]]
[[ko:면역계면역계통]]
[[lt:Imuninė sistema]]
[[mk:Имунолошки систем]]
21,579

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/505832" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ