"షిండ్లర్స్ లిస్ట్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: pt:Schindler's List)
చి
}}
 
''షిండ్లర్స్ ఆర్క్'' అనే నవల ఆధారంగా [[స్టీవెన్ స్పీల్బర్గ్]] [[1993]]లో తీసిన చిత్రం ఇది. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ద]] కాలంలో [[యూదులు|యూదుల]] పైన జర్మనులు మారణహోమం సాగిస్తున్నపుడు జర్మన్ వ్యాపారవేత్త అయిన [[ఆస్కార్ షిండ్లర్]] వెయ్యిమందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా నియమించి వారి ప్రాణాలను కాపాడిన యథార్థ సంఘటన ఈ చిత్రానికి మూలం. [[2007]] లో [[అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిటూట్]] ఈ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నది.
 
== కథాంశం ==
[[1939]]లో [[చెకోస్లోవేకియా]]కు చెందిన [[ఆస్కార్ షిండ్లర్]] అనే ధనవంతుడు తక్కువ కూలికి పని చేసే యూదులున్న క్రాకో అనే పట్టణానికి వస్తాడు. అప్పటికే [[నాజీ]] సభ్యుడయిన షిండ్లర్ ఆ పట్టణాన్ని తన గుప్పిట ఉంచుకున్న జర్మన్ సైన్యానికి పెద్ద ఎత్తున లంచాలు చెల్లించి యూదులను అతి తక్కువ కూలికి పని చేసే విధంగా తన ఫ్యాక్టరీకి రప్పించుకుంటాడు. జర్మన్ సైన్యానికి అవసరమయిన చిన్న చిన్న పరికరాలు తయారు చేసి లాభాలు గడిస్తూ జర్మనుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు.
 
అమోన్ గోథ్ అనే క్రూరుడయిన మిలటరీ అధికారి ఆ పట్టణంలో నిర్భంధ కూలీల క్యాంపు నిర్మించడానికి వచ్చి ఎదురు తిరిగినవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపించడం కళ్ళారా చూసి షిండ్రల్ చలించిపోతాడు. డబ్బుకంటే మనిషి ప్రాణం ఎంతో విలువయినది అని తెలుసుకుంటాడు. కొద్ది రోజులకు ఆ పట్టణాన్ని వదిలి అక్కడున్న యూదులను 'ఆస్విచ్' అనే ప్రాంతానికి తరలించమని జర్మన్ సైనికులకు ఆదేశాలు అందుతాయి. ( ఆస్విచ్ అన్నది అతి పెద్ద జర్మన్ 'కాన్సంట్రేషన్ క్యాంపు. ఈ క్యాంపులో జర్మన్ సైన్యం చేతిలో పది లక్షలకు పైగా యూదులు హింసలకు గురి అయి మరణించారు. )
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/507026" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ