పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బొమ్మ:British_Museum_Lalita.jpgను బొమ్మ:Lalita_statue.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Túrelio; కారణం: (exact, or scaled-down duplicate).
చి యంత్రము కలుపుతున్నది: ne:पार्वती
పంక్తి 146: పంక్తి 146:
[[lt:Parvati]]
[[lt:Parvati]]
[[mr:पार्वती]]
[[mr:पार्वती]]
[[ne:पार्वती]]
[[nl:Parvati]]
[[nl:Parvati]]
[[nn:Parvati]]
[[nn:Parvati]]

10:20, 24 ఆగస్టు 2010 నాటి కూర్పు

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

వివిధ రూపాలలో పార్వతి చిత్రణ
పార్వతి
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
శక్తి, సౌభాగ్యం, రక్షణ
దేవనాగరి: पार्वती
తెలుగు: పార్వతి, ఉమ, గౌరి, శక్తి,
అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
నివాసం: కైలాసం
ఆయుధం: వివిధ ఆయుధాలు (దుర్గగా)
పతి / పత్ని: శివుడు
వాహనం: సింహము, పులి

పార్వతి (ఆంగ్లం: Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.


ప్రధాన కధ

వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. [1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి. [2][3]

ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.

పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.

వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.

మత సంప్రదాయాలు

పేర్లు, అవతారాలు

పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది

పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -

గ్రంధాలూ, పురాణాలూ

దేవాలయాలు

ఆచారాలు, పండగలు

ప్రార్ధనలు, స్తోత్రాలు

పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.

ఇవి కూడా చూడండి

చతుర్భుజయైన లలితగా పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)

మూలాలు

  1. Kena Upanisad, III.11-IV.3, cited in Müller and in Sarma, pp. xxix-xxx.
  2. Kinsley p.36
  3. Kinsley p.37
"https://te.wikipedia.org/w/index.php?title=పార్వతి&oldid=537324" నుండి వెలికితీశారు