చిట్కాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:ఆరోగ్యం]]
[[వర్గం:ఆరోగ్యం]]
[[వర్గం:ఆరోగ్య చిట్కాలు]]
[[వర్గం:ఆరోగ్య చిట్కాలు]]
పుదిన ఆకు రసమ్ లెదా తులసి ఆకు రసమ్ లొ ఉప్పు కలిపి మొటిమలు మీద రాసుకొని గంట తరువాత వేడి నీటీతొ కడిగెయాలి.

07:46, 21 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

వంటింటి చిట్కాలు

  • టమాట, పాలకూర అన్ని రకాల కూరగాయలు, ఇలా దేనితోనైనా చిక్కని స్టాక్ తయారు చేసుకొని చల్లార్చి, ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయాలి. గట్టి పడిన తరువాత క్యూబ్స్ ను విడదీసి పాలిథీన్ కవర్‌లో వేసి గాలి లేకుండా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వాడు కోవచ్చు.
  • ఉల్లి పాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
  • ఎక్కువగా పండిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి.
  • టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడి నీటిలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.
  • కూరల్లో ఉప్పు ఎక్కువైతే తొక్క తీసిన పచ్చి టమాట అందులో వేస్తే అదనపు ఉప్పును అది పీల్చుకుంటుంది.
  • మిరప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే డబ్బాలో చిన్న ముక్క ఇంగువ వేయాలి.
  • ఉప్పు సీసాలో ఒక చెంచా మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారి ముద్ద కాదు.
  • చక్కెర డబ్బాలో మూడులేక నాలుగు లవంగాలు వేస్తే చీమలు పట్టవు.
  • బిస్కిట్లు నిలువ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే మెత్తబడకుండా కరకరలాడుతాయి.
  • పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే, చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసివేసి పచ్చడి వేయాలి.
  • బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కాని ఎండు మిరపకాయలు కాని వేయాలి.
  • ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఒకటిన్నర కప్పుల మినప పప్పు, ఐదు కప్పుల బియ్యానికి, ఒక కప్పు నాన పెట్టిన అటుకులను కలిపితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
  • బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.

సౌందర్య చిట్కాలు

పుదిన ఆకు రసమ్ లెదా తులసి ఆకు రసమ్ లొ ఉప్పు కలిపి మొటిమలు మీద రాసుకొని గంట తరువాత వేడి నీటీతొ కడిగెయాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=చిట్కాలు&oldid=544410" నుండి వెలికితీశారు