ద్వినామ నామకరణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ദ്വിപദ നാമപദ്ധതി)
 
== అంతర్జాతీయ వృక్ష నామీకరణ ==
18 వ శతాబ్దంలో వృక్ష శాస్త్రజ్ఞులు అనేక రకాల కొత్త మొక్కలను కనుగొనటం, వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఈ నామీకరణ చేయటానికి ఒక నియమావళి లేకపోవటంతో, ఒకే మొక్కకు రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. అందువలన వృక్ష నామీకరణకు ఒక నియమావళి ఉండాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మొక్కల నామీకరణకు కొన్ని మూల సూత్రాలను మొదటిసారిగా లెన్నేయస్ ప్రతిపాదించాడు. అగస్టీన్ డీ కండోల్ 1813లో వృక్ష నామీకరణకు సంబంధించిన పూర్తిస్థాయి సూత్రాలను తన గ్రంధమైన థియెరి ఎలిమెంటైరి డి లా బొటానిక్ (Theorie elementaire de la botanique) లో ప్రతిపాదించాడు. వాటిని డీ కండోల్ సూత్రాలు (de CAndollean rules) అని అంటారు. అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశము (International Botanical Congress)లలో వృక్షనామీకరణ నియమావళులను పునఃపరిశీలన చేశారు. ప్రస్తుతము ఉన్న [[అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి]] (International Code of Botanical Nomenclature:ICBN) 1978లో అమోదించబడినది.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/565533" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ