కుంకుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి [r2.5.2] యంత్రము కలుపుతున్నది: it:Sapindus
పంక్తి 51: పంక్తి 51:
[[ht:Bwa savonèt]]
[[ht:Bwa savonèt]]
[[hu:Mosódiófa]]
[[hu:Mosódiófa]]
[[it:Sapindus]]
[[ka:საპნის ხე]]
[[ka:საპნის ხე]]
[[ne:रिठ्ठो]]
[[ne:रिठ्ठो]]

18:20, 11 డిసెంబరు 2010 నాటి కూర్పు

కుంకుడు
సపిండస్ మార్జినేటస్
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సపిండస్

కుంకుడు (Sapindus) ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. సపిండస్ ప్రజాతిలోని 13 జాతులలో దక్షిణ భారతదేశంలో సా.లారిఫోలియస్ మరియు సా.ఎమర్జినేటస్ లను మనం ఉపయోగిస్తున్నాము.

లక్షణాలు

  • మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • ఉపాంతరహిత అగ్రంతో దీర్ఘవృత్తాకార పరకాలున్న సమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
  • అగ్రస్థ శాఖయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న గోధుమరంగుతో ఉన్న పసుపురంగు పుష్పాలు.
  • మూడు నొక్కులు గల టెంకగల ఫలం.

ఉపయోగాలు

  • కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెంట్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది.
  • కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
  • కుంకుడు కర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగా ఉపయోగపడుతుంది.
  • పట్టు మరియు సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
  • తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కుంకుడు&oldid=567344" నుండి వెలికితీశారు