యోగ దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
షడ్దర్శనాలలో యోగదర్శనం ఒకటి. దీని రచయిత పతంజలి మహర్షి. ఈయన కాలం ఇతమిత్థంగా తెలియకపోయినా, తన కాలం నాటికి వ్యాప్తిలో ఉన్న యోగ విద్యా రహస్యాలను క్రోడీకరించి యోగ సూత్రాలు రచించాడు.
#దారిమార్పు [[యోగా]]

==యోగ సూత్రాలు==
"అథ: యోగానుశాసనమ్" అని యోగశాస్త్ర గ్రంథం ప్రారంభమవుతుంది. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. జడమైన ప్రకృతి పురుషుని (జీవాత్మ) సాన్నిధ్యంవల్ల ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతినుంచి జడం ఉద్భవిస్తుంది. మహత్ అంటే బుద్ధి (చిత్తం). చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు. అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులను, వికారాలను, వృత్తులను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే.
చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.

అభ్యాస వైరాగ్యాల ద్వారా చిత్త వికారాలను నిరోధించాలి. అభ్యాసం అంటే చిత్తాన్ని ఇంద్రియాలద్వారా గ్రహించే బాహ్య వస్తువులనుంచి మళ్ళీ మళ్ళీ మరల్చుతూ దాన్ని అంతర్ముఖం చేసి, ఏకాగ్రతను అభ్యసించి సాధించడం. వైరాగ్యం అంటే బాహ్య విషయాల పట్ల సుఖానుభవాల పట్ల వైముఖ్యాన్ని పెంచుకోవడం. దీనివల్ల పురుషునికి (జీవాత్మ) చిత్తంతో సంబంధం నశిస్తుంది. అట్టి సంబంధం ఉండడం వల్లనే చిత్తం అనుభవించే సుఖదు:ఖాలన్నీ తానే అనుభవిస్తున్నట్టు పురుషుడు భ్రమిస్తున్నాడు. ఆ భ్రమ తొలగితే అదే ముక్తవైకల్య స్థితి.
భ్రమ తొలగి దు:ఖం లయించడానికి, ఆనందం సిద్ధించడానికి ఒక ఉపాయంగా ఈశ్వర భక్తి భావాన్ని యోగ దర్శనం పేర్కొంటుంది. ఈశ్వరునియందు భక్తిభావం, సర్వార్పణ భావం కలిగిన శరణాగతివల్ల కైవల్యం సిద్ధిస్తుంది. ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగఅ సాధారణంగఅ జీవాత్మ అనుభవించే క్లేశాలను, కర్మ విపాకాన్ని అనుభవించకుండా వాటిచే పరామృష్ఠుడు కాకుండా ఉండే పురుషోత్తముడే ఈశ్వరుడు అని, ఈశ్వర శరణాగతివల్ల శాశ్వతానందం లభిస్తుందని యోగం అంటుంది.

13:16, 26 జనవరి 2011 నాటి కూర్పు

షడ్దర్శనాలలో యోగదర్శనం ఒకటి. దీని రచయిత పతంజలి మహర్షి. ఈయన కాలం ఇతమిత్థంగా తెలియకపోయినా, తన కాలం నాటికి వ్యాప్తిలో ఉన్న యోగ విద్యా రహస్యాలను క్రోడీకరించి యోగ సూత్రాలు రచించాడు.

యోగ సూత్రాలు

"అథ: యోగానుశాసనమ్" అని యోగశాస్త్ర గ్రంథం ప్రారంభమవుతుంది. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. జడమైన ప్రకృతి పురుషుని (జీవాత్మ) సాన్నిధ్యంవల్ల ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతినుంచి జడం ఉద్భవిస్తుంది. మహత్ అంటే బుద్ధి (చిత్తం). చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు. అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులను, వికారాలను, వృత్తులను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే. చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.

అభ్యాస వైరాగ్యాల ద్వారా చిత్త వికారాలను నిరోధించాలి. అభ్యాసం అంటే చిత్తాన్ని ఇంద్రియాలద్వారా గ్రహించే బాహ్య వస్తువులనుంచి మళ్ళీ మళ్ళీ మరల్చుతూ దాన్ని అంతర్ముఖం చేసి, ఏకాగ్రతను అభ్యసించి సాధించడం. వైరాగ్యం అంటే బాహ్య విషయాల పట్ల సుఖానుభవాల పట్ల వైముఖ్యాన్ని పెంచుకోవడం. దీనివల్ల పురుషునికి (జీవాత్మ) చిత్తంతో సంబంధం నశిస్తుంది. అట్టి సంబంధం ఉండడం వల్లనే చిత్తం అనుభవించే సుఖదు:ఖాలన్నీ తానే అనుభవిస్తున్నట్టు పురుషుడు భ్రమిస్తున్నాడు. ఆ భ్రమ తొలగితే అదే ముక్తవైకల్య స్థితి. భ్రమ తొలగి దు:ఖం లయించడానికి, ఆనందం సిద్ధించడానికి ఒక ఉపాయంగా ఈశ్వర భక్తి భావాన్ని యోగ దర్శనం పేర్కొంటుంది. ఈశ్వరునియందు భక్తిభావం, సర్వార్పణ భావం కలిగిన శరణాగతివల్ల కైవల్యం సిద్ధిస్తుంది. ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగఅ సాధారణంగఅ జీవాత్మ అనుభవించే క్లేశాలను, కర్మ విపాకాన్ని అనుభవించకుండా వాటిచే పరామృష్ఠుడు కాకుండా ఉండే పురుషోత్తముడే ఈశ్వరుడు అని, ఈశ్వర శరణాగతివల్ల శాశ్వతానందం లభిస్తుందని యోగం అంటుంది.