కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nl:Kubera
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ta:குபேரன்
పంక్తి 16: పంక్తి 16:
[[en:Kubera]]
[[en:Kubera]]
[[kn:ಕುಬೇರ]]
[[kn:ಕುಬೇರ]]
[[ta:குபேரன்]]
[[ml:കുബേരൻ]]
[[ml:കുബേരൻ]]
[[als:Kubera]]
[[als:Kubera]]

03:50, 2 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు


కుబేరుడు

కుబేరుడు (సంస్కృతం: कुबेर) హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.

కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు.

ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని చూడటం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు

కుబేరుడు ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.

"https://te.wikipedia.org/w/index.php?title=కుబేరుడు&oldid=581012" నుండి వెలికితీశారు