బ్రాహ్మీ లిపి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Βράχμι
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pt:Escrita Brāhmī
పంక్తి 31: పంక్తి 31:
[[no:Brahmi-skrift]]
[[no:Brahmi-skrift]]
[[pl:Brahmi]]
[[pl:Brahmi]]
[[pt:Escrita Brāhmī]]
[[ru:Брахми]]
[[ru:Брахми]]
[[sa:ब्राह्मी लिपि]]
[[sa:ब्राह्मी लिपि]]

18:37, 9 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

కాలానుగుణముగా బ్రాహ్మీ లిపి పరిణామము తేదీలతో సహా. ముంబాయి లోని కణేరీ గుహలలో ఇందులోని అనేక లిపుల ఉదాహరణలు ఉన్నాయి.

బ్రాహ్మీ లిపి ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ అశోకుని శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల శ్రీలంక మరియు తమిళనాడులలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్ మరియు థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.

దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, టిబెట్, మంగోలియా, మంచూరియాలలోని దాదాపు అన్ని లిపులు బ్రాహ్మీ నుండి పుట్టినవే. కొరియన్ హంగుల్ కూడా కొంతవరకు బ్రాహ్మీ నుండే ఉద్భవించి ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తముగా ఉపయోగించే హిందూ అరబిక్ అంకెలు బ్రాహ్మీ అంకెలనుండే ఉద్భవించాయి.